ఇండియన్ క్రికెటర్లతో పార్టీ చేసుకోండి.. టికెట్లు అమ్మిన ఘనుడు

దిశ, స్పోర్ట్స్ :‘రోహిత్ శర్మతో భోజనం చేస్తారా’.. ‘కేఎల్ రాహుల్‌తో కాఫీ తాగుతారా’ లేదా ‘రవి శాస్త్రితో బీర్ తాగుతారా’.. ఏంటీ ఇవన్నీ అనుకుంటున్నారా? ఆస్ట్రేలియాలో ఒక మోసగాడు ఏకంగా ఇలా యాడ్స్ ఇచ్చి పలువురు అభిమానుల నుంచి ఏకంగా డబ్బులు వసూలు చేశాడు. టీమ్ ఇండియాతో కలవండి వాళ్లను అభినందించండి అనే పేరుతో ఒక ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు ప్రకటనలు ఇచ్చి పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. ఈ మోసాన్ని ఆస్ట్రేలియా పోలీసులు రట్టు […]

Update: 2021-01-06 11:10 GMT

దిశ, స్పోర్ట్స్ :‘రోహిత్ శర్మతో భోజనం చేస్తారా’.. ‘కేఎల్ రాహుల్‌తో కాఫీ తాగుతారా’ లేదా ‘రవి శాస్త్రితో బీర్ తాగుతారా’.. ఏంటీ ఇవన్నీ అనుకుంటున్నారా? ఆస్ట్రేలియాలో ఒక మోసగాడు ఏకంగా ఇలా యాడ్స్ ఇచ్చి పలువురు అభిమానుల నుంచి ఏకంగా డబ్బులు వసూలు చేశాడు. టీమ్ ఇండియాతో కలవండి వాళ్లను అభినందించండి అనే పేరుతో ఒక ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు ప్రకటనలు ఇచ్చి పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. ఈ మోసాన్ని ఆస్ట్రేలియా పోలీసులు రట్టు చేశారు. వివరాల్లోకి వెళితే..

‘మీట్ అండ్ గ్రీట్ విత్ టీమ్ ఇండియా’ అనే పేరుతో ఒక నకిలీ ఈవెంట్‌ను సృష్టించారు. సిడ్నీలో జనవరి 5న ఈవెంట్ నిర్వహిస్తున్నామని.. ఒక్కో టికెట్ ధర 550 ఆస్ట్రేలియన్ డాలర్లు ( రూ. 31,000) గా నిర్ణయించారు. దీంతో దాదాపు 200 మందికి పైగా ఈవెంట్ టికెట్లు కొనుగోలు చేశారు. టీమ్ ఇండియా మెల్‌బోర్న్ నుంచి సిడ్నీ వచ్చే రోజునే ఈవెంట్ ఉండటంతో చాలా మంది టికెట్లు కొనుగోలు చేసి.. ఈమెంట్ మేనేజర్ చెప్పిన ప్రదేశానికి వచ్చారు. కోవిడ్ సమయంలో భారీగా ఒక హోటల్ వద్దకు వచ్చిన వారందరినీ ఆస్ట్రేలియా పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ నకిలీ ఈవెంట్ నిర్వహించిన ఘనుడి గురించి గాలింపు చేపట్టారు.

Tags:    

Similar News