పోడు రైతులకు పట్టాలు ఇస్తానని దాడులు చేస్తారా.. : తమ్మినేని

దిశ,కొత్తగూడెం: పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని, 2006 అటవీ హక్కుల చట్టాన్ని పకడ్భందీగా అమలు చేయాలని, పోడు రైతుల పై నిర్భందాలకు స్వస్తి పలకాలని కొత్తగూడెంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పోడు రైతు పొలికేక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ ఎం.ఎల్ రాష్ట్ర నాయకులు గుమ్మడి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. సదస్సుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి భారీగా తరలివచ్చిన […]

Update: 2021-09-29 09:15 GMT

దిశ,కొత్తగూడెం: పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని, 2006 అటవీ హక్కుల చట్టాన్ని పకడ్భందీగా అమలు చేయాలని, పోడు రైతుల పై నిర్భందాలకు స్వస్తి పలకాలని కొత్తగూడెంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పోడు రైతు పొలికేక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ ఎం.ఎల్ రాష్ట్ర నాయకులు గుమ్మడి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. సదస్సుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి భారీగా తరలివచ్చిన పోడు రైతులు, వామపక్ష పార్టీల శ్రేణులు తరలివచ్చారు.

ఈసందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జిల్లాలన్నీ తిరిగి కుర్చీ వేసుకొని పోడు రైతులందరికీ పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పి, అధికారంలోకి రాగానే పోడు రైతులపై దాడులు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. ఓ పక్క పోడు రైతులు, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా ఢిల్లీలో నరేంద్ర మోడీకి వూడిగం చేస్తున్నాడని మండిపడ్డారు.

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, జిల్లాలోని పోడు రైతుల ఓట్లతో గెలిచి అధికార పార్టీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, మెచ్చా నాగేశ్వరరావులను ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. అక్టోబరు 5వ తేదీన జరగనున్న అశ్వారావుపేట నుండి ఆదిలాబాద్ వరకు చేపట్టే రోడ్ల దిగ్బంధం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను, పోడు రైతులను కోరారు. కాగా, ఈ సదస్సుకు కాంగ్రెస్, టీజేఎస్, బీస్పీ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు.

Tags:    

Similar News