బ్యాంకు రుణాల ఎగవేతదారులపై కఠిన చర్యలు: నిర్మలా సీతారామన్!
దిశ, వెబ్‌డెస్క్: బ్యాంకుల నుంచి ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగ్గొట్టిన వారి విషయంలో కేంద్రం అత్యంత కఠినంగా ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఎగవేతదారులు దేశంలో ఉన్నా, విదేశాలకు పారిపోయినప్పటికీ వదిలే ప్రసక్తే లేదు అని, వారి నుంచి ప్రతి పైసాను రికవరీ చేస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. బ్యాంకుల నుంచి తీసుకున్న నగదును వెనక్కి తెప్పిస్తామని మంగళవారం జమ్మూ-కశ్మీర్ పర్యటన సందర్భంగా నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. బ్యాంకుల్లో ఎటువంటి మోసాలు జరిగినా, ఇప్పటికే తీసుకున్న […]
దిశ, వెబ్‌డెస్క్: బ్యాంకుల నుంచి ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగ్గొట్టిన వారి విషయంలో కేంద్రం అత్యంత కఠినంగా ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఎగవేతదారులు దేశంలో ఉన్నా, విదేశాలకు పారిపోయినప్పటికీ వదిలే ప్రసక్తే లేదు అని, వారి నుంచి ప్రతి పైసాను రికవరీ చేస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. బ్యాంకుల నుంచి తీసుకున్న నగదును వెనక్కి తెప్పిస్తామని మంగళవారం జమ్మూ-కశ్మీర్ పర్యటన సందర్భంగా నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. బ్యాంకుల్లో ఎటువంటి మోసాలు జరిగినా, ఇప్పటికే తీసుకున్న రుణాలను చెల్లించకుండా ఉన్నా వారిపై కఠినంగా ప్రభుత్వం పనిచేస్తుంది.
ఎగవేతదారులు తీసుకున్న రుణాలను తిరిగి కట్టేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రికగ్నిషన్, రిజల్యూషన్, రీక్యాపిటలైజేషన్ విధానాన్ని అనుసరిస్తోందని ఆర్థిక మంత్రి అన్నారు. బ్యాంకుల రుణాలను తిరిగి చెల్లించకుండా ఉన్నవారిపై తప్పనిసరిగా చర్యలు చేపడతాం. వారి ఆస్తులను జప్తు చేసి న్యాయపరమైన ప్రక్రియను అనుసరిస్తాం. ఆస్తుల వేలం ద్వారా రుణాలను బ్యాంకులకు తిరిగిస్తామని వెల్లడించారు.