ప్రియుడా.. పొలానికి పోతున్నాం.. ప్రాణాలు తీద్దాం రా

దిశ, కొత్తగూడెం: ఇగో ఏడున్నవ్.. నేను మా ఆయనతో పొలంలోని పంపు సెట్టు వద్దకు పోతున్న.. నువ్వు అక్కడికి వచ్చేయ్.. ఖతం చేద్దాం అంటూ ఓ ప్రియురాలు ప్రియుడికి ఫోన్ చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డోస్తున్నాడని భర్తను చంపేందుకు భార్య ప్లాన్ చేసింది. ఆ వార్త విన్న ప్రియుడు కూడా మర్డర్‌కు ముందుకొచ్చాడు. ఈ క్రమంలోనే సరిగ్గా పొలం వద్దకు చేరుకున్న ప్రియుడు.. ప్రియురాలితో కలిసి భర్తను కింద పడేశారు. ఓ చున్నిని మెడకు చుట్టి ఊపిరాడకుండా […]

Update: 2021-04-03 06:33 GMT

దిశ, కొత్తగూడెం: ఇగో ఏడున్నవ్.. నేను మా ఆయనతో పొలంలోని పంపు సెట్టు వద్దకు పోతున్న.. నువ్వు అక్కడికి వచ్చేయ్.. ఖతం చేద్దాం అంటూ ఓ ప్రియురాలు ప్రియుడికి ఫోన్ చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డోస్తున్నాడని భర్తను చంపేందుకు భార్య ప్లాన్ చేసింది. ఆ వార్త విన్న ప్రియుడు కూడా మర్డర్‌కు ముందుకొచ్చాడు. ఈ క్రమంలోనే సరిగ్గా పొలం వద్దకు చేరుకున్న ప్రియుడు.. ప్రియురాలితో కలిసి భర్తను కింద పడేశారు. ఓ చున్నిని మెడకు చుట్టి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశారు. కొడుకు అనుమానంతో చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. ఈ దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని లక్ష్మీదేవి పల్లి మండలం గడ్డిగుట్టలో వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గడ్డిగుట్ట గ్రామానికి చెందిన రామ్‌లాల్ గత కొన్నేండ్ల క్రితం చిన్ని అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. అంతా సాఫీగా జరుగుతున్న వీరి కాపురంలో ఇదే గ్రామానికి చెందిన జోగారావు చిచ్చు పెట్టాడు. వీరిద్దరూ స్నేహంగా ఉంటూనే గతేడాది నుంచి వివాహేతర సంబంధానికి తెరలేపారు. నిజం ఎక్కువ రోజులు దాగదు అన్నట్టు.. భర్త రామ్‌లాల్‌కు వీరి విషయం తెలిసిపోయింది. అది జీర్ణించుకోలేకపోయిన రామ్‌లాల్ తరచూ చిన్నితో గొడవ పడేవాడు.

ఇక జోగారావుతో సంబంధం కొనసాగించడానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన చిన్ని అతడిని హత్య చేసేందుకు ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే పొలంలో పని ఉందంటూ భర్తను పంపు సెట్టు వద్దకు తీసుకొచ్చింది. ఇదే సమయంలో ప్రియుడికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. ఇక రామ్‌లాల్ ఒంటరిగా ఉండడంతో అదును చూసి దాడి చేశారు. కింద పడేసి ఓ చున్నితో మెడకు ఉరి వేశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు ఎవరిదారి వారు చూసుకున్నారు.

కొడుకు అనుమానంతోనే నిజం వెలుగులోకి..

కానీ, తన తండ్రి మృతిపై కొడుకు రమేశ్‌‌కు అనుమానం వచ్చింది. మృతిపై విచారణ చేపట్టాలని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే చిన్నిని గట్టిగా మందలించగా.. జోగారావుతో కలిసి హత్య చేసినట్టు ఒప్పుకుంది. దీంతో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Tags:    

Similar News