KIMS Hospital: శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్‌రాజు.. రేవతి భర్తకు సంచలన హామీ
పుష్ప-2 సినిమా(Pushpa-2 Movie) బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రి
దిశ, వెబ్‌డెస్క్: పుష్ప-2 సినిమా(Pushpa-2 Movie) బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్(Sri Tej)ను తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్(TFDC), నిర్మాత దిల్ రాజు(Dil Raju) పరామర్శించారు. అనంతరం కిమ్స్ ఆసుపత్రి వద్దే మీడియాతో మాట్లాడారు. రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అవసరమైతే రేవతి భర్త భాస్కర్‌కు ఇండస్ట్రీలో పర్మినెంట్ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
రేవతి(Revathi) కూతురు భవిష్యత్ బాధ్యతను తాము తీసుకుంటామని ప్రకటించారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తాం.. తర్వాత జరగాల్సిన వాటిపై చర్చిస్తామని అన్నారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. రెండ్రోజుల్లో వెంటిలేటర్ పైనుంచి షిఫ్ట్ చేస్తామని వైద్యులు చెప్పారని అన్నారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు జరగాలని ఎవరూ కోరుకోరని తెలిపారు. ప్రజలకు మీడియా వాస్తవాలు చూపించాలని కోరారు. అమెరికా నుంచి రాగానే సీఎం రేవంత్ రెడ్డిని, నటుడు అల్లు అర్జున్‌ను ఇద్దరినీ కలిశానని అన్నారు.
Read More...