CPI: ఆ సినిమాలకు ఇక నుంచి అనుమతి ఇవ్వొద్దు.. సెన్సార్ బోర్డుకు ఎమ్మెల్యే సంచలన విజ్ఞప్తి
ఒకప్పుడు సమాజాన్ని మార్చడానికి సినిమా(Cinema)లు ఉపయోగపడేవని, ఇప్పుడు విలన్లను హీరోల్లా చూపిస్తూ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని సీపీఐ తెలంగాణ
దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పుడు సమాజాన్ని మార్చడానికి సినిమా(Cinema)లు ఉపయోగపడేవని, ఇప్పుడు విలన్లను హీరోల్లా చూపిస్తూ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని సీపీఐ తెలంగాణ(CPI Telangana) రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(Kunamneni Sambasiva Rao) అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సెన్సార్ బోర్డు(Sensor board) పూర్తిగా ఫెయిల్ అయిందని విమర్శించారు. సంధ్య థియేటర్(Sandhya Theater) వద్ద తొక్కిసలాటలో రేవతి(Revathi) అనే మహిళ చనిపోవడం బాధాకరం అని అన్నారు.
ఈ ఘటనలో సినిమా వర్సెస్ ప్రభుత్వం అనేలా చర్చ జరిగిందని చెప్పారు. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అంతకుముందు హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్(Sri Tej)ను సీపీఐ నేతలు పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్రమక్రమంగా బాలుడు కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. అనంతరం కూనంనేని మీడియాతో మాట్లాడి అల్లు అర్జున్‌పై ఫైర్ అయ్యారు. రౌడీయిజాన్ని ప్రోత్సహించే సినిమాలకు అనుమతులు ఇవ్వొద్దని సెన్సార్ బోర్డుకు కూనంనేని సూచించారు.