భర్త శవాన్ని పాతేయడం ఎలా..? గూగుల్ సెర్చ్ చేసిన భార్య
దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్ ఫోన్ వచ్చాకా ప్రపంచం మొత్తం అరచేతిలో ప్రత్యక్షమైపోయింది. ఇక ప్రపంచంలో ఏ మూల ఏం జరిగిందో.. ఏం కావాలో అన్ని చెప్పడానికి గూగుల్ తల్లి ఉండనే ఉంది. గూగుల్ లో మనకు దొరకని సమాధానం ఉండదు. అయితే గూగుల్ ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారిని చూసాం.. కానీ ఇక్కడ ఓ మహిళ ప్రియుడి మోజులో పడి భర్తను చంపడానికి గూగుల్ నే ఉపయోగించుకుంది. గూగుల్ లో వచ్చిన […]
దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్ ఫోన్ వచ్చాకా ప్రపంచం మొత్తం అరచేతిలో ప్రత్యక్షమైపోయింది. ఇక ప్రపంచంలో ఏ మూల ఏం జరిగిందో.. ఏం కావాలో అన్ని చెప్పడానికి గూగుల్ తల్లి ఉండనే ఉంది. గూగుల్ లో మనకు దొరకని సమాధానం ఉండదు. అయితే గూగుల్ ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారిని చూసాం.. కానీ ఇక్కడ ఓ మహిళ ప్రియుడి మోజులో పడి భర్తను చంపడానికి గూగుల్ నే ఉపయోగించుకుంది. గూగుల్ లో వచ్చిన సమాచారంతో భర్తను హతమార్చింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే..
హద్రా జిల్లా ఖేడిపూర్ ప్రాంతానికి చెందిన అమీర్ అనే వ్యక్తికి తబుస్సమ్ అనే మహిళకు గత కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఆర్థిక ఇబ్బందుల రీత్యా అమీర్ భార్యను ఇంట్లోనే వదిలి ఉద్యోగం కోసం మహారాష్ట్ర వెళ్లాడు. దీంతో భార్య తబుస్సమ్ తన ఇంటివద్ద ఉంటున్న మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొంది. భర్త దూరంగా ఉండడంతో వీరి సంబంధానికి అడ్డు లేకుండా పోయింది. ఇక ఈ క్రమంలోనే కరోనా లాక్ డౌన్ పెట్టడంతో భర్త అమీర్ ఇంటికి తిరిగివచ్చాడు. భర్త తిరిగిరావడంతో భార్య, ప్రియుడు కలుసుకోవడం కుదరలేదు. ప్రియుడ్ని వదిలి ఉండలేని భార్య ఎలాగైనా భర్తను అడ్డుతొలగించుకోవాలని ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. దీనికోసం గూగుల్ ని నమ్ముకుంది. గూగుల్ సెర్చ్ లో హత్య ఎలా చేయాలి.. మృత దేహాన్ని ఎలా వదిలించుకోవాలి.. ఎవరి కంట పడకుండా పాతేయడం ఎలా..?, ఆధారాలు దొరక్కుండా తప్పించుకోవడం ఎలా? అనే విషయాల గురించి గూగుల్ లో వెతికింది. ఇలా 15 గంటలు ఏకధాటిగా సెర్చ్ చేసి పక్కా ప్రణాలికను సిద్ధం చేసింది.
భర్తకు ఆస్తమా ఉందని గ్రహించిన భార్య అతనికి రోజూ ఇచ్చే మందులను మార్చేసింది. ఆ భర్త వాడే మందులు కాకుండా వేరే మందులు ఇవ్వడంతో ఆటను అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. ఇక ఇదే అదునుగా ప్రియుడ్ని ఇంటికి పిలిచి భర్త తలపై సుత్తితో మోది హతమార్చారు. అనంతరం ఏమి తెలియనిదానిలా పోలీసులకు ఫోన్ చేసి నా భర్తను ఎవరో చంపేశారు అంటూ మొసలి కన్నీరు కార్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న అమీర్ ని చూసి తొలుత ఇంటిని దోచుకెళ్లడానికి వచ్చినవారి పని అయ్యిఉంటుందని అనుమానించారు. అదే సమయంలో భార్య అనుమాస్పదంగా ఉండడం చూసి ఆమె ఫోన్ తీసుకొని విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. దీంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త స్థానికంగా సంచలనం రేపుతోంది.