ఉప్పుతో ఉపయోగాలెన్నో..

షడ్రుచుల్లో ఒకటైన ‘ఉప్పు’.. భూమిపైనున్న సమస్త జంతువులకూ కావాల్సిన లవణం. ఉప్పుపై ఆధారపడని అవయవం మన శరీరంలో ఉండదంటే అతిశయోక్తి కాదు. ఉప్పు ఆహార పదార్థాలకు రుచిని కలిగించడమే కాకుండా, మితంగా తీసుకుంటే ఆరోగ్యాన్నీ ఇస్తుంది. ఆయుర్వేదంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న ఉప్పుతో అనేక వ్యాధులకు చికిత్స చేస్తున్నారు. మన శరీరంలోని రక్తంలో ఉప్పు పదార్థం ఉంటుంది. అలాగే, దేహంలోని రక్తం, రసం, మాంసం, మేధస్సు, మజ్జా, అస్థి, శుక్రముల (7 ధాతువులు) సక్రమ పరిణామానికి తోడ్పడుతుంది. […]

Update: 2020-03-27 21:25 GMT

షడ్రుచుల్లో ఒకటైన ‘ఉప్పు’.. భూమిపైనున్న సమస్త జంతువులకూ కావాల్సిన లవణం. ఉప్పుపై ఆధారపడని అవయవం మన శరీరంలో ఉండదంటే అతిశయోక్తి కాదు. ఉప్పు ఆహార పదార్థాలకు రుచిని కలిగించడమే కాకుండా, మితంగా తీసుకుంటే ఆరోగ్యాన్నీ ఇస్తుంది. ఆయుర్వేదంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న ఉప్పుతో అనేక వ్యాధులకు చికిత్స చేస్తున్నారు. మన శరీరంలోని రక్తంలో ఉప్పు పదార్థం ఉంటుంది. అలాగే, దేహంలోని రక్తం, రసం, మాంసం, మేధస్సు, మజ్జా, అస్థి, శుక్రముల (7 ధాతువులు) సక్రమ పరిణామానికి తోడ్పడుతుంది. శరీరానికి ఉప్పు అందకపోయినట్టయితే, జీర్ణక్రియ స్తంభిస్తుంది. దీంతో అనేక వ్యాధులు దరిచేరుతాయి. గ్లాసు మంచినీళ్ళు.. చెంచాడు సోడా ఉప్పు కలిపి తాగితే కడుపు నొప్పి వెంటనే తగ్గుతుంది. రాళ్ల ఉప్పును వేయించి, కాపడం పెడితే వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. సైంధవ లవణం, పూదీనా ఆకు చూర్ణాన్ని ఆహారం తీసుకున్న తర్వాత రోజుకు రెండుసార్లు రెండు గ్రాముల పొడిని నీళ్లలో కలుపుకుని తాగితే కడుపుబ్బరం, పులిత్రేన్పులు, అజీర్ణం దూరమవుతాయి. ఉప్పులో అధికంగా ఉండే సోడియం.. శరీరంలోని ఆమ్ల క్షార నిష్పత్తిని క్రమబద్దీకరించే చర్యలో ముఖ్యపాత్ర వహిస్తుంది. దేహంలో నీటి సమతుల్యతను కాపాడుతుంది. సోడియం తక్కువైతే డీహైడ్రేషన్‌ కలుగుతుంది. ఆహారంలో లవణం లేకపోతే, హృద్రోగాలు తప్పవని ఇప్పటికే పలురువు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉప్పు వాడకపోతే, అధిక రక్తపోటుకు కారణమయ్యే ‘అల్డోస్టెరాన్’ హార్మోన్లు విడుదలవుతాయని వివరించారు.
అయితే, ఏదైనా మితంగా తీసుకుంటేనే హితం. కానీ, వేగంగా మారుతున్న జీవనశైలిలో భాగంగా సమయం ఆదా పేరుతో రెడీమేడ్‌గా దొరికే ఆహారాలను తీసుకోవడానికే నేటితరం అలవాటు పడుతోంది. ఇలాంటి ఆహారాల్లో సాధారణం కన్నా ఎక్కువ మోతాదులో సోడియం ఉంటుంది. జాతీయ పోషకాహారం సంస్థ ప్రకారం.. ఒక వ్యక్తి రోజుకు ఆరు గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలి. కానీ, ఇలాంటి అలావాట్ల వల్ల సగటున ఒక్కో వ్యక్తి రోజుకు 8 నుంచి 12 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నాడు. పోషకాహార సంస్థ సూచించిన దాని కంటే ఇది ఎక్కువ. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే అధిక రక్తపోటు, జీర్ణాశయం కాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

యాలకుల వల్ల బెనిఫిట్స్

 

Tags:    

Similar News