వారంలో మానాల్సిన గాయం.. కేవలం 4 గంటల్లో మానేలా జెల్! శాస్త్రవేత్తల అద్భుత సృష్టి
సాధారణంగా శరీరానికి గాయమైనప్పుడు అది మానడానికి దాదాపు వారం నుంచి రెండు వారాల వరకు పడుతుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: సాధారణంగా శరీరానికి (wounds) గాయమైనప్పుడు అది మానడానికి దాదాపు వారం నుంచి రెండు వారాల వరకు పడుతుంది. డాక్టర్లను సంప్రదించకుంటే కొన్ని గాయాలు నెలల తరబడి వేధిస్తుంటాయి. అయితే గాయాలు త్వరగా మానేలా శాస్త్రవేత్తలు ఓ జెల్‌ను కనుగొన్నారు. గాయం మానడాన్ని వేగవంతం చేయగల ఒక వినూత్నమైన (Hydrogel) హైడ్రోజెల్‌ను తాజాగా శాస్త్రవేత్తలు సృష్టించారు. ఈ జెల్‌తో కేవలం 4 గంటల్లోనే 90% గాయాన్ని సరిచేయడానికి, ఒక రోజులో పూర్తిగా గాయం నయం అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కొత్త హైడ్రోజెల్‌ను ఫిన్లాండ్‌లోని ఆల్టో యూనివర్సిటీ, జర్మనీలోని బైరైట్ యూనివర్సిటీ పరిశోధకులు కలిసి అభివృద్ధి చేశారు.
ప్రత్యేక హైడ్రోజెల్‌ను తయారు చేయడానికి అతి పలుచనైన నానోషీట్‌తో కూడిన పాలిమర్ ఉపయోగించారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాలిన గాయాలు, శస్త్రచికిత్స గాయాలు,ఇతర గాయాలకు చికిత్స చేయడానికి మానవ చర్మం లక్షణాలను బట్టి హైడ్రోజెల్, వేగవంతంగా గాయం మానిపోతుంది. ఇది అందుబాటులోకి వస్తే వైద్యరంగంలో కొత్త చరిత్ర అవుతుందని నిపుణులు విశ్వసిస్తున్నారు. కాగా, ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూస్తుంటే తనకు గాయాన్ని వెంటనే తగ్గించే ‘స్కిన్ గన్’లా అనిపిస్తుంది అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. ఈ జెల్ తక్కువ ఖర్చుతో త్వరగా అందుబాటులోకి రావాలని నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు. ఈ జెల్ శరీరంపై ఎలాంటి పెద్ద గాయాన్నైనా మాన్పించగలదా? అని నెటిజన్లు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
Read More..