స్వర్గంలో ప్లాట్ల అమ్మకం.. ఎగబడి కొన్న జనం.. అసలు విషయం తెలిసి నోరెళ్లబెట్టిన జనం!
రియల్ ఎస్టేట్ (Real Estate) రంగంలో వచ్చే లాభాల గురించి అందరికి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: రియల్ ఎస్టేట్ (Real Estate) రంగంలో వచ్చే లాభాల గురించి అందరికి తెలిసిందే. వేలు, లక్షలు పెట్టి కొన్న భూములు.. అమ్మేటప్పుడు కోట్లలో ధర పలుకుతాయి. అందుకే చాలా మంది భూమిపై పెట్టుబడులు పెడుతుంటారు. దాచుకున్న డబ్బు, అప్పులు చేసి మరీ భూములు, ప్లాట్లు కొంటుంటారు. ఇదంతా మనకు తెలుసు. ఇక చంద్రయాన్ 3 ప్రాజెక్టు విజయవంతమైన సమయంలో చాలా మంది చంద్రుడిపై స్థలం కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా వార్తలు వైరల్ అయ్యాయి. అచ్చం ఇదే తరహాలో ఓ చర్చి (Church) స్వర్గంలో (Heaven) స్థలం అమ్ముతున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, తమకు దేవుడే (God) స్వయంగా ఈ అవకాశం ఇచ్చినట్లుగా చెప్పుకొచ్చింది. తాజాగా నెట్టింట వైరల్‌గా మారిన ఈ వార్తకు సంబంధించి వివరాల్లోకి వెళ్లితే..
మెక్సికోకు చెందిన ఓ చర్చి స్వర్గంలో భూములు అమ్మకానికి ఉన్నాయని, చదరపు మీటరు కేవలం వంద డాలర్లే అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ రియల్ ఎస్టేట్ అమ్మకాలకు సంబంధించి దేవుడి అనుమతి కూడా తీసుకున్నట్టు వెల్లడించింది. 2017లో దేవుడు తమకు కలలో కనిపించినప్పుడు ఈ ప్రతిపాదన ఆయన ముందు ఉంచితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపింది. ఈ మేరకు ఆన్ లైన్‌లో ప్రకటనలు ఇవ్వడమే కాకుండా బ్రోచర్లు సైతం ప్రింట్ చేసి పంచిపెట్టింది. వెంటనే కొనుగోలు చేసిన వారు దేవుడి ఇంటి పక్కనే నివాసం ఉండొచ్చని, ఇందుకు తమ గ్యారంటీ అంటూ చెల్లింపుల కోసం క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ పేమెంట్ తదితర అన్ని రకాల సదుపాయాలను ఇచ్చింది.
అయితే, ఈ మాటలు నమ్మేదెవరు, కొనేదెవరు అనుకుంటున్నారా? కానీ, ఎంతో మంది వేల డాలర్లు పోసి జాగాలు కొనేశారు. గతంలో దక్షిణాఫ్రికా, స్పెయిన్‌లో కూడా ఈ తరహా ప్రకటనలు వెలుగుచూాయి. అప్పట్లో కూడా జనాలు తమ ఆస్తులు నమ్మి మరీ స్వర్గంలో స్థలాలు కొనుకున్నారు. అయితే, ఇది పాత విషయమే అయినప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటి ప్రకటనలు నమ్మి జనాలు మోసపోకూడదని, వాటిపై అవగాహన కలిగి ఉండాలని నెటిజన్లు సూచిస్తున్నారు.