వచ్చేస్తోన్న వేసలి కాలం.. ఏసీలు పేలకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాల్సిందే..?
సమ్మర్ రాకముందే ఎండలు మండిపోతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: సమ్మర్ రాకముందే ఎండలు మండిపోతున్నాయి. ఇంకా వేసవికాలం వస్తే.. జనాలు బయటకు పోవాలంటేనే భయపడిపోతారు. వడదెబ్బ కారణంగా పలు అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. కాగా వేసవి కాలంలో బయటకు వెళ్లాలంటే పలు జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే ఇంట్లో కూడా ఉక్కపోతతో ఇబ్బంది పడుతుంటారు.
కాగా చాలా మంది సమ్మర్ రాగానే ఏసీలు, కూలర్లు వాడుతుంటారు. దీంతో ఇంట్లో చల్లదనం ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏసీల్లో పాములు, అలాగే ఏసీలు పేలడం వంటి సంఘటనలు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. ఈ ఘనటనలు జనాల్ని భయాందోళనకు గురి చేస్తుంటాయి. కాగా ఏసీలు ఉపయోగించేవారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఏసీలు పేలడానికి ఉష్ణోగ్రతలో పెరుగుదల ముఖ్యం. కాగా ఏసీ రూమ్‌ను కూల్‌గా మార్చేందుకు బయట ఉండే కండెన్సర్ చాలా కష్టపడుతుంది. దీంతో మొత్తం దానిపైనే ఒత్తిడి పడుతుంది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఛేంజ్ అయ్యే క్రమంలో కండెన్సర్‌పై ఒత్తిడి పడుతుంది. కాగా ఆ సమయంలో ఏసీ పేలిపోయే చాన్స్ ఉంటుంది.
కాగా ఏసీ కండెన్ర్ నీడలో ఉండేలా చూడండి. దీంతో ఎలాంటి ప్రమాదం ఉండదు. అలాగే గాలి ఆడే ప్లేస్‌లో ఉంచండి. యూనిట్ బాగా వేడెక్కకుండా చూసుకోండి. చిన్న చిన్న రిపేర్లు ఏమైనా ఉంటే వెంటనే చేపిస్తే బెటర్. అప్పుడప్పుడు ఏసీ కూడా చెక్ చేస్తూ ఉండాలి. ఎయిర్ ఫిల్టర్లు, కూలింగ్ కాయిల్స్ వంటివ తరచూ క్లీన్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
తద్వారా కంప్రెసర్‌పై ఎక్కువ ఒత్తిడి పడకుండా ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఏసీలో ఉండే కూలింగ్ ఫ్యాన్‌ను కూడా అప్పుడప్పుడు పరిశీలిస్తూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.