Grok: గ్రోక్‌లో కొత్త ఫీచర్ అదిరిపోయింది.. క్షణాల్లో నచ్చినట్లుగా అందిస్తుంది!
ఛాట్ జీపీటీకి (ChatGPT) పోటీగా టెక్ దిగ్గజం, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon musk) ప్రవేశపెట్టిన గ్రోక్ (Grok) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

దిశ, వెబ్ డెస్క్: ఛాట్ జీపీటీకి (ChatGPT) పోటీగా టెక్ దిగ్గజం, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon musk) ప్రవేశపెట్టిన గ్రోక్ (Grok) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూజర్లు అడిగిన ప్రశ్నలకు అడిగినట్లు సూటిగా సుత్తి లేకుండా సమాధానమిస్తూ ఔరా అనిపిస్తుంది ఈ గ్రోక్. దీంతో కొద్దీ రోజుల్లోనే విశేష ఆదరణ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలోనే గ్రోక్ ద్వారా యూజర్లకు మరిన్ని సేవలు అందించేందుకు తాజాగా ఇందులో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అదే 'ఎడిట్ ఇమేజ్ (Edit image)'. యూజర్లకు కావాల్సిన విషయాన్ని టెక్ట్స్ రూపంలో అందిస్తే చాలు క్షణాల్లో ఫొటోను అందిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోను స్వయంగా ఎలాన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
గ్రోక్ అకౌంట్‌ని లాగిన్ అయ్యాక సెర్చ్ బార్ కింద డీప్‌సెర్చ్, థింక్ అని రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. దాని పక్కనే కొత్తగా ఎడిట్ ఆప్షన్‌ను జత చేశారు. ఈ ఆప్షన్‌ను ఎంచుకొని ఎలాంటి మార్పులు కావాలో దానికి సంబంధించిన టెక్ట్స్ అందించాలి. వెంటనే ఫొటోను ఎడిట్ చేసి అందిస్తుంది. ఇలా ఏ ఇమేజ్ అయినా సరే కోరిన విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పటికే డెస్క్‌టాప్‌లో గ్రోక్ ఉపయోగిస్తున్న యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉండగా, త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. ఇక ఈ ఫీచర్‌తో సోషల్ మీడియా యూజర్ల తమ ఫొటోలను మరింత ఆకర్షణీయంగా మార్చుకుంటున్నారు. అయితే, ఈ ఫీచర్ను కొందరు దుర్వినియోగం చేసే ప్రమాదముందని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
— Elon Musk (@elonmusk) March 22, 2025