Interesting study : మూడు రోజులు ఆ పని మానేస్తే.. తర్వాత జరిగేది ఇదే..
Interesting study : మూడు రోజులు ఆ పని మానేస్తే.. తర్వాత జరిగేది ఇదే..
దిశ,ఫీచర్స్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అద్భుతాలు చేస్తోంది. సక్రమంగా వాడుకునేవారికి ఆనందాన్ని కలిగిస్తోంది. అవకాశాలను సృష్టిస్తోంది. కొంగొత్త ఆశలను రేకెత్తిస్తోంది. దుర్వినియోగం చేసుకుంటే మాత్రం అంధకారంలోకి నెడుతోంది. అనారోగ్యాలకు దారితీస్తోంది. అలాంటి మరో ఆసక్తికర అంశాన్నే లేవనెత్తింది తాజా అధ్యయనం. స్మార్ట్‌ఫోన్ అతిగా వాడుతున్నవారు దానిని మూడు రోజులు పక్కన పెడితే ఏం జరుగుతుందో తెలుసుకునే ఉద్దేశంతో హైడెల్‌బెర్గ్(Heidelberg ), అండ్ కొలోన్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్స్ పరిశోధనలు నిర్వహించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
అధ్యయనంలో భాగంగా పరిశోధకులు స్మార్ట్‌ఫోన్ అతిగా యూజ్ చేస్తున్న 30 ఏండ్ల వయసు గల 25 మంది యువకులు అబ్జర్వ్ చేశారు. రోజూ వాడటంవల్ల వారి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో గుర్తించారు. అలాగే ఫోన్ వాడకం తగ్గిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మూడు రోజులు (72 గంటలు) స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని తగ్గించాలని, కేవలం అత్యవసర పనులకు మాత్రమే పరిమితం చేయాలని యువతకు సూచించారు. అయితే ఫోన్ వాడుతున్న సందర్భంలోనూ, వాడకం తగ్గించిన సంరద్భంలోనూ ఎంఆర్ఐ స్కాన్‌ల ద్వారా మెదడు కార్యకలాపాలను, మానసిక స్థితిని కూడా పరిశోధకులు అంచనా వేశారు. కాగా తగ్గించడంవల్ల మెదుడు రివార్డ్ ప్రాసెసింగ్ ప్రక్రియలో గణనీయమైన సానుకూల మార్పులను గమనించినట్లు పరిశోధకులు పేర్కొన్నారు.
ఇవీ ప్రయోజనాలు
* బ్రెయిన్ రివార్డ్ సిస్టమ్‌లో మార్పులు : స్మార్ట్‌ఫోన్‌లను ఎక్కువగా వాడటంవల్ల యూజర్లు నిరంతరం నోటిఫికేషన్లు, లైకులు, స్క్రోలింగ్‌లపై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తారు. ఇది వారి మెదడులో ఆనందాన్ని కలిగించే డోపమైన్ విడుదలను ప్రేరేపిస్తుంది. దీనివల్ల బ్రెయిన్ రివార్డ్ సిస్టమ్ అతిగా పనిచేయడం, అతిగా స్పందించడం వల్ల ఒత్తిడికి గురవుతుంది. అయితే మూడు రోజుల డిటాక్స్ వల్ల అంటే.. స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని తగ్గించడంవల్ల మెదడులోని రివార్డ్‌సిస్టమ్స్ సమతుల్యంగా పనిచేయడం ద్వారా అది సాధారణ స్థితికి వస్తుంది. ఇది టెక్నాలజీ వ్యసనం, అతి వినియోగంవల్ల కలిగిన అనారోగ్యాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
*ఆసక్తులు, కోరికల నియంత్రణ : స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా వాటంవల్ల ఏదో ఒకటి తెలుసుకోవాలని లేదా చూడాలనే తీవ్రమైన కోరికలు పెరుగుతాయి. ఇవి వ్యసనానికి దారితీస్తాయి. అయితే ఇలాంటివారు 72 గంటలపాటు అంటే మూడు రోజులు ఫోన్ వాడకాన్ని తగ్గించినప్పుడు మాత్రం మానసిక ప్రశాంతత పెరిగిందని అధ్యయనం నిరూపించింది. అందుకే ఒత్తిడికి గురైనప్పుడు డిజిటల్ డిటాక్సినేషన్ అవసరం అని నిపుణులు చెబుతున్నారు.
*మానసిక స్థితిలో మెరుగుదల : స్మార్ట్‌ఫోన్ అతి వినియోగం మానసిక స్థితిలో ప్రతికూల మార్పులకు కూడా దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే మూడు రోజులు దానిని పక్కన పెట్టినప్పుడు పరిశోధకులు ఒత్తిడి, ఆందోళ స్థాయిలు తగ్గినట్లు గుర్తించారు. అందుకే మెంటల్ ఇష్యూస్ ఎదుర్కొంటున్నట్లయితే ఫోన్ వాడకాన్ని తగ్గించి చూడాలని సూచిస్తున్నారు.
*ఏకాగ్రత, ప్రొడక్టివిటీ : స్మార్ట్‌ఫోన్ మూడు రోజులు వాడకం తగ్గించినప్పుడు బాధితుల్లో ఏకాగ్రతతోపాటు ప్రొడక్టివిటీ పెరిగినట్లు పరిశోధకులు తేల్చారు. అంటే కొన్నిసార్లు పనులను సమర్థవంతంగా నిర్వహించగల శక్తిని స్మార్ట్‌ఫోన్ అతివాడం హరిస్తుంది. అందుకే మీలో ప్రొడక్టివిటీ తగ్గడం, ఏకాగ్రత లోపించడం, నిద్రలేమి వేధించడం వంటివి జరిగితే మూడు రోజులు స్మార్ట్‌ఫోన్ పక్కన పెట్టి చూడండి. అప్పుడు అన్ని విధాలా మీ మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.