Gold saree: నేతన్న అద్భుతం.. కూతురి కోసం బంగారంతో చీర.. ధర ఎంతంటే?

హస్త కళలకు తెలంగాణ పుట్టినిల్లు లాంటిదనటంలో అతిశయోక్తి లేదు.

Update: 2025-04-08 11:23 GMT
Gold saree: నేతన్న అద్భుతం.. కూతురి కోసం బంగారంతో చీర.. ధర ఎంతంటే?
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: హస్త కళలకు తెలంగాణ పుట్టినిల్లు లాంటిదనటంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా రాష్ట్రంలోని నేతన్నలు సృష్టించే అద్భుత చేనేత కళలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు వచ్చాయి. గతంలో అగ్గిపెట్టేలో పట్టే చీరను నేసి అబ్బుర పరిచిన నేతన్నలు, తాజాగా మగ్గంపై బంగారు చీరను నేసి ఔరా అనిపించారు. సిరిసిల్ల జిల్లాకు చెందిన నల్లా విజయ్ కుమార్ ఈ అద్భుత్తాన్ని సృష్టించాడు. అయితే, ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. బంగారు చీరను నేసింది అగ్గిపెట్టేలో పట్టే పట్టుచీరలు నేసి ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటి చెప్పిన నల్లా పరందాములు కుమారుడే.

కర్ణాటక రాష్ట్రం (Karnataka state) బళ్లారికి (Ballery) చెందిన ఓ వ్యాపారవేత్త తన కూతురి వివాహం కోసం బంగారు చీర కావాలని సిరిసిల్ల జిల్లాకు చెందిన నల్ల విజయ్ కుమార్‌ను సంప్రదించాడు. వ్యాపారి ఆర్డర్ మేరకు చీరను తయారు చేయడానికి విజయ్ 20 గ్రాముల (2 తులాలు) బంగారం ఉపయోగించాడు. ముందుగా బంగారాన్ని జరిపోవులు తీసి, కొత్త డిజైన్ తయారు చేయడానికి దాదాపు 10 రోజులు పట్టింది. మొత్తం 5.5 మీటర్ల పొడవు, 48 ఈంచుల వెడల్పు, 800 గ్రాములు బరువు కలిగిన చీరను విజయ్ తయరు చేశారు. ఇక ఈ చీర ఖరీదు సుమారుగా రూ.2.80 వేల పైగా ఉంటుందని ఆయన తెలిపారు.

కాగా, విజయ్ కుమార్ తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ 2012 నుంచి మగ్గాలపై వినూత్న ప్రయోగాలు చేయటం ప్రారంభించాడు. ఇందులో భాగంగా ఉంగరం నుంచి దూరే చీరతో మొదలుకొని, కుట్టులేని జాతీయ పతాకం, కుట్టులేని లాల్చి, పైజామా, అరటి నారలతో శాలువా, తామరలతో చీర, వెండి కొంగుతో చీర, మూడు కొంగుల చీర, 220 రంగులతో చీరలను నేయడం వంటివి ఎన్నో కొత్త రకాల చీరలు, వస్త్రాలను విజయ్ మార్కెట్‌లోకి తీసుకువచ్చారు. విజయ్ చేసిన ఈ ప్రయోగాలతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు కూడా వచ్చింది. 

Tags:    

Similar News