Instamart: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ కస్టమర్లకు గుడ్‌న్యూస్..10 నిమిషాల్లోనే స్మార్ట్‌ఫోన్‌ మీ ఇంటికే

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2025-03-26 07:13 GMT
Instamart: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ కస్టమర్లకు గుడ్‌న్యూస్..10 నిమిషాల్లోనే స్మార్ట్‌ఫోన్‌ మీ ఇంటికే
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ (Swiggy Instamart) తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ పెట్టిన పది నిమిషాల్లోనే డోర్ స్టెప్ డెలివరీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఈ కొత్త సర్వీస్‌‌ను తాజాగా ప్రారంభించింది. ఆపిల్, శామ్‌సంగ్, వన్‌ప్లస్, షియోమి, రెడ్‌మి వంటి డిమాండ్ ఉన్న మోడళ్ల వరకు స్మార్ట్‌ఫోన్‌లను ఆర్డర్ చేయవచ్చు. ఇక అన్ని స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు కేవలం నిమిషాల్లో డోర్‌స్టెప్ డెలివరీకి అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రకటించింది. ఈ (Smartphones delivery) కొత్త సర్వీస్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, పూణే, గుర్గావ్, నోయిడా, ఫరీదాబాద్‌లతో సహా పది ప్రధాన నగరాల్లో అందుబాటులో తేనున్నట్లు సంస్థ తెలిపింది. ఇప్పటికే ఇలాంటి సేవలను బ్లింకిట్‌, జెప్టో సంస్థలు అందిస్తున్న విషయం తెలిసిందే.

కాగా, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ప్రారంభంలో కేవలం కిరాణా సామాగ్రి, ఫుడ్, స్నాక్స్, రోజువారీ నిత్యావసరాలపైనే ఇది వరకు దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్‌లోకి అడుగుపెట్టి వ్యూహాత్మక మార్పులు చేస్తోంది. ఈ సంస్థ తన పరిధిని క్రమంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ దాదాపు 100కి పైగా భారత నగరాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తుంది.

Tags:    

Similar News