Bicycle Aircraft: సైకిల్ ఎయిర్ క్రాఫ్ట్.. దటీజ్ జపాన్.. వీళ్ళ క్రియేటివిటీ మాములుగా లేదుగా

Bicycle Aircraft: అదేదో ఇంగ్లీష్ మూవీలో ఎగిరే సైకిళ్లు ఉంటాయి.

Update: 2025-03-30 04:54 GMT
Bicycle Aircraft: సైకిల్ ఎయిర్ క్రాఫ్ట్.. దటీజ్ జపాన్.. వీళ్ళ క్రియేటివిటీ మాములుగా లేదుగా
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: Bicycle Aircraft: అదేదో ఇంగ్లీష్ మూవీలో ఎగిరే సైకిళ్లు ఉంటాయి. అది సినిమా కాబట్టి గ్రాఫిక్స్ మాయాజాలంతో దేన్నయినా ఎగిరించవచ్చు. కానీ నిజజీవితంలో ఎగిరే సైకిళ్లను మీరేప్పుడైనా చూశారా? మనిషి తలచుకుంటే ఏదైనా సాధ్యమని మరోసారి నిరూపించారు జపాన్ విద్యార్థులు. మామూలుగానే క్రియేటివిటీలో జపాన్ ముందు ఉంటుంది. రకరకాల వినూత్న ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. అయితే తాజాగా సైకిల్ ఎయిర్ క్రాఫ్ట్ ను తయారు చేసి ఔరా అనిపించారు. జపాన్ లోని ఒసాకా పబ్లిక్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థుల బృందం 2019 ఈ ఎగిరే సైకిల్ ఎయిర్ క్రాఫ్ట్ ను రూపొందించారు. అంతేకాదు దీనిని విజయవంతంగా ఎగిరించారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ సైకిల్ 19కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించింది. ఈ సైకిల్ ఎయిర్ క్రాఫ్ట్ కు సురుగి అని నామకరణం చేశారు.

ఈ సైకిల్ కు వెనక సైడ్ ఒక ఫ్యాన్ ఉంటుంది. విమానం వలె రెక్కలు ఉంటాయి. గాలిలో ఎగరడం మాత్రమే కాదు.. ఓ మనిషి సైకిల్ మీద ఎలా అయితే కూర్చుని సైకిల్ తొక్కుతే ఎలా ఉంటుందో.. అదేవిధంగా గాలిలో సైకిల్ ఎగురుతుంటే దానిపై కూర్చొన్న వ్యక్తి పైడిల్ తొక్కుతూ ఉండాలి. ఫుషా సకాయ్, సకాయ్ మిండ్ మిల్ అసోసియేషన్ అభివృద్ధి చేసిన ఈ సురిగి మానవ శక్తితో నడిచే విమానయానం పట్ల విద్యార్థుల అకింత భావాన్ని ప్రదర్శిస్తుంది

ఈ సైకిల్ ఎయిర్ క్రాఫ్ట్ ఒక ప్రత్యేకమైన పెడలింగ్ విధానం ద్వారా పనిచేస్తుంది. ఇది రైడర్ టేకాఫ్, స్థిరమైన విమానానికి థ్రస్ట్ ను ఉత్పత్తి చేయడానికి అనుమతిస్తుంది. ఈ అద్భుతమైన ఆవిష్కరణ విద్యార్థుల ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని హైలైట్ చేయడమే కాకుండా స్థిరమైన విమాన టెక్నాలజీలను అన్వేషణకు కూడా దోహదపడుతుంది చెబుతున్నారు.

దాదాపు ఐదు సంవత్సరాల క్రితం పోస్టు చేసిన ఈ వీడియోను దాదాపు 2 మిలియన్ మంది వీక్షించారు. ఇది రైట్ బ్రదర్స్ మొదటి విమానంలా కనిపిస్తోందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వందఏళ్ల తర్వాత యాంత్రిక ఇంజిన్ లేకుండా నడిపేందుకు ఈ సైకిల్ ఎయిర్ క్రాఫ్ట్ ఎంతో ఉపయోగపడుతుందని మరో నెటిజన్ కామెంట్ చేశారు. అయితే మరికొందరు మాత్రం గాలిలో ఎగురుతుంటే పెడలింగ్ చేయడం వల్ల అలసిపోతామని అంటున్నారు. 




Tags:    

Similar News