Viral Video: వామ్మో..! ఈ కింగ్‌కోబ్రా ఏం చేసిందో చూడండి.. ఏకంగా సింహాన్నే!?

ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.

Update: 2025-03-23 14:13 GMT
Viral Video: వామ్మో..! ఈ కింగ్‌కోబ్రా ఏం చేసిందో చూడండి.. ఏకంగా సింహాన్నే!?
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల్లో నిత్యం జంతువులకు సంబంధించిన వీడియోలు, జంతువుల మధ్య జరిగే బికిర పోరులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. సాధారణంగా అడవిలో అనేక జంతువులు( Animals ) నివసిస్తూ ఉంటాయి. ఒక్కొసారి అడవిలో జంతువుల మధ్య గొడవలు కూడా జరుగుతాయి. ఈ తరుణంలో ఒక జంతువు అడవిలో జీవనం కొనసాగించాలంటే మరో జంతువు చావాల్సిందే అనే పరిస్థితులు కూడా ఉంటాయి.

ఇదిలా ఉంటే.. అడవికి రాజైన సింహం( Lion ) వేటకు బయలుదేరిన సమయంలో దారిన ఏ జంతువు కనబడితే ఆ జంతువులు వేటాడి మరి ప్రాణాలను సైతం తీసేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక సింహానికి అనుకోని సంఘటన చోటు చేసుకుంది. అత్యంత పొడవైన విష సర్పాలలో ఒకటైన నల్లత్రాచు(కింగ్ కోబ్రా) పై సింహం దాడికి ప్రయత్నించింది. రోడ్డు పక్కన ఉన్న బండరాయి పక్కన అతిపెద్ద కింగ్ కోబ్రా ఉంది.

ఇక అటు వైపుగా వెళుతున్న అడవికి రారాజైన సింహం కింగ్ కోబ్రాను చూసి.. దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఉన్నట్టుండి దానిపై దాడి చేయాలని చూడగా నల్లత్రాచు బుసలు కొట్టడంతో సింహం పరుగులు తీసింది. ఈ వీడియో(Video)ను ఓ రిటైర్డ్ IFS అధికారి షేర్ చేస్తూ ‘ఎవరు గెలుస్తారో చెప్పాలి’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు అడవికి రారాజైన సింహం పాము బుసలు కొట్టడంతో భయపడిపోయిందిగా, పాము కాటేస్తే సింహం ఖతం ఎందుకంటే కింగ్ కోబ్రా ఒక్కసారి కాటేస్తే 20 ML విషం బాడీలోకి ఎక్కుతుంది అది సింహాన్ని చంపేస్తుంది. ఇంకా సింహం ఒక్క పంజా దెబ్బ పాము తలపై కొడితే పాము చస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

https://www.instagram.com/reel/DHgMfIMuP1m/?utm_source=ig_web_copy_link

Tags:    

Similar News