కొన్ని రోజులుగా సోషల్ మీడియాను ఊపేస్తోన్న HERO డాన్స్.. ‘అన్నా నువ్వు మావోనివే’ అంటున్న ఫ్యాన్స్
తమిళ హీరో కార్తీ(Tamil hero Karthi) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: తమిళ హీరో కార్తీ(Tamil hero Karthi) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పేరుకే తమిళ హీరో అయిన ఈయనకు తెలుగులోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కార్తీ నటించిన యుగానికి ఒక్కడు, అవారా, ఊపిరి, ఖైదీ వంటి సినిమాలతో తెలుగులో అద్భుతమైన మార్కెట్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈయన లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో వస్తోన్న ఖైదీ-2 షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉండగా.. ప్రసుతం సోషల్ మీడియా(Social media)లో కార్తీకి సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో ఆయన చేసిన డాన్స్‌కు నెటిజన్లు కనెక్ట్ అయ్యారు. ఎలాంటి హడావిడి చేయండా సింపుల్‌గా వచ్చి.. జనాల్లో కలిసి.. సామాన్యుడిలాగే డాన్స్ చేశాడు. గత కొన్ని రోజులుగా ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది గమనించిన నెటిజన్లు ‘ఇంత సింప్లిసిటీ మీకే సాధ్యం’ అంటూ కొందరు కామెంట్లు చేస్తుండగా.. ‘అన్నా నువ్వు మావోడివే’ ఇంకొందరు రియాక్ట్ అవుతున్నారు.
లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)తో పాటు మరికొన్ని కొత్త కథలను కూడా కార్తీ ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గౌతమ్ వాసు దేవ్ మీనన్(Gautham Vasudev Menon), హెచ్ వినోద్(H.Vinod), పా రంజిత్, మారి సెల్వరాజ్, సుందరి సి, శివ లాంటి డైరెక్టర్లతో వచ్చే ఐదారేళ్లు కార్తీ వరుసగా సినిమాలు చేయబోతున్నట్లు సమాచారం.
READ MORE ...
‘కార్తీ-29’ సినిమాలో హీరోయిన్ ఫిక్స్.. కాంబో అదిరిపోయిందంటున్న నెటిజన్లు