AP News :హిందువుల పండగలకే ఆంక్షలు ఎందుకు.. బ్రిటీష్ పాలనలో ఉన్నామా.?

దిశ, తెలంగాణ బ్యూరో : బ్రిటీష్ కాలం నాటి అణచివేత ఆంధ్రాలో కొనసాగుతోందని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాశ్ ఆరోపించారు. వినాయక చవితి కేవలం ఇండ్లలోనే జరుపుకోవాలని ఆదేశాలు ఇవ్వడం వివక్షత అన్నారు. రేపు క్రిస్మస్ వేడుకలు ఇంటికే పరిమితమని చెప్పే దమ్ము సీఎం జగన్‌కు ఉందా అని ప్రశ్నించారు. వీధుల్లో మండపాలు పెడితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల పండగలకే ఆంక్షలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. తిరుమలలో కొవిడ్ […]

Update: 2021-09-06 02:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : బ్రిటీష్ కాలం నాటి అణచివేత ఆంధ్రాలో కొనసాగుతోందని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాశ్ ఆరోపించారు. వినాయక చవితి కేవలం ఇండ్లలోనే జరుపుకోవాలని ఆదేశాలు ఇవ్వడం వివక్షత అన్నారు. రేపు క్రిస్మస్ వేడుకలు ఇంటికే పరిమితమని చెప్పే దమ్ము సీఎం జగన్‌కు ఉందా అని ప్రశ్నించారు.

వీధుల్లో మండపాలు పెడితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల పండగలకే ఆంక్షలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. తిరుమలలో కొవిడ్ నిబంధనలను పాటిస్తే స్వాగతించాము. నేడు అన్నింటికీ అనుమతి ఇచ్చి వినాయక చవితికి ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. ఏపీలో చట్టం పని చేయడం లేదని ఆరోపించారు.

చవితి వేడుకలు చేస్తే అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు. వేడుకలు ఘనంగా నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అనుమతిస్తే ఏపీలో హిందువుల మనోభావాలు దెబ్బ తినేల నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. దీన్ని నిరసిస్తూ ఏపీలో ఆందోళనలు చేపట్టాలని తెలిపారు. విశ్వాసాలు దెబ్బతీసే పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని ఆంక్షలు విధించినా చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. వైసీపీ పాలనలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు.

Tags:    

Similar News