‘టూల్‌కిట్’లో ఏయే అంశాలుంటాయి?

దిశ, ఫీచర్స్: భారత్‌లో రైతు నిరసనలకు మద్ధతుగా అమెరికా పాప్ సింగర్ రిహానా, ఎన్విరాన్‌మెంటల్ యాక్టివిస్ట్ గ్రెటా థెన్‌బెర్గ్‌‌లు ట్వీట్ చేయడంతో.. సెంట్రల్ మినిస్టర్స్, సెలెబ్రిటీలు, క్రీడాకారులతో పాటు ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఇండియా ఐకమత్యంగా ఉంటుందంటూ ట్వీట్లతో హోరెత్తించిన విషయం తెలిసిందే. అయితే గ్రెటా థెన్‌బెర్గ్ తన ట్వీట్‌లో ‘టూల్ కిట్’ గురించి ప్రస్తావించింది. ఈ క్రమంలోనే ‘టూల్‌కిట్’ సృష్టికర్తలపై దేశద్రోహం, నేరపూరిత కుట్ర, విద్వేషాన్ని పెంపొందించడం వంటి ఆరోపణలతో ఢిల్లీ పోలీసు సైబర్ క్రైమ్ సెల్ […]

Update: 2021-02-06 06:52 GMT

దిశ, ఫీచర్స్: భారత్‌లో రైతు నిరసనలకు మద్ధతుగా అమెరికా పాప్ సింగర్ రిహానా, ఎన్విరాన్‌మెంటల్ యాక్టివిస్ట్ గ్రెటా థెన్‌బెర్గ్‌‌లు ట్వీట్ చేయడంతో.. సెంట్రల్ మినిస్టర్స్, సెలెబ్రిటీలు, క్రీడాకారులతో పాటు ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఇండియా ఐకమత్యంగా ఉంటుందంటూ ట్వీట్లతో హోరెత్తించిన విషయం తెలిసిందే. అయితే గ్రెటా థెన్‌బెర్గ్ తన ట్వీట్‌లో ‘టూల్ కిట్’ గురించి ప్రస్తావించింది. ఈ క్రమంలోనే ‘టూల్‌కిట్’ సృష్టికర్తలపై దేశద్రోహం, నేరపూరిత కుట్ర, విద్వేషాన్ని పెంపొందించడం వంటి ఆరోపణలతో ఢిల్లీ పోలీసు సైబర్ క్రైమ్ సెల్ గురువారం ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. అయితే ఇందులో గ్రెటా పేరు లేదని స్పష్టం చేసిన అధికారులు.. ఆమెపై కేసు నమోదు చేసినట్లు వస్తున్న వార్తలు నిజం కాదని వివరణ ఇచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో అసలు ‘టూల్ కిట్’ అంటే ఏమిటి? దానికి ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తున్నారు.?

‘టూల్‌కిట్’ అనేది తప్పనిసరిగా అమలుచేసే మార్గదర్శకాలు లేదా సజెషన్స్ కాగా, అంశాన్ని బట్టి టూల్‌కిట్ లక్ష్యాలు, మార్గదర్శకాలు మారుతుంటాయి. ఉదాహరణకు.. ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (అంతర్గత వాణిజ్యం)ను ప్రోత్సహించే విభాగానికి సంబంధించి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (ఐపీఆర్) అమలు చేసే విషయంలో టూల్‌కిట్ ఉంది. ఐపీఆర్ ఉల్లంఘనలను దర్యాప్తు చేసేటప్పుడు అనుసరించాల్సిన మార్గదర్శకాలతో పాటు దానికి వర్తించే చట్టాలు, నకిలీ, పైరసీ వంటి పదాల నిర్వచనాలు ఇతరత్రా ప్రాథమిక అంశాలు ఇందులో ఉంటాయి. అలాగే అమెరికన్ అసోసియేషన్ విభాగమైన ‘యంగ్ అడల్ట్ లైబ్రరీ సర్వీసెస్ అసోసియేషన్’‌కు సంబంధించి అనేక టూల్‌కిట్స్ ఆన్‌లైన్‌లో ఉన్నాయి. అవి సమర్థవంతమైన లైబ్రరీ వ్యవస్థల పనితీరు, యువతతో కలిసి పనిచేసే విషయంలో అమలు చేసే విధానాలను స్పష్టం చేస్తాయి. ఇక నిరసనల సందర్భంలో.. టూల్‌కిట్‌లో సాధారణంగా నిరసన సందర్భం ఏమిటి, అనుసరించాల్సిన పద్ధతులు, కార్యాచరణ ఏమిటి, నిరసన గురించి వస్తున్న స్పందన, దానికి సంబంధించిన వార్తా కథనాల లింకులు వంటివి ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్న రైతు నిరసనల నేపథ్యంలోనే కాదు, గతంలోనూ పలు అంతర్జాతీయ నిరసనల సందర్భంగానూ టూల్‌కిట్స్ ప్రాధాన్యత సంపాదించుకున్నాయి.

టూల్‌కిట్స్ దశాబ్దాలుగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియా వల్ల గత కొన్నేళ్లుగా వీటి ప్రస్తావన వినబడుతోంది. 2011 వాల్ స్ట్రీట్ ఆక్రమణ, 2019 హాంకాంగ్ నిరసనలతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక వాతావరణ నిరసనల్లో టూల్‌కిట్‌ల సూచనలు తెరమీదకు వచ్చాయి. ఇండియా వ్యాప్తంగా జరిగిన సీఏఏ వ్యతిరేక నిరసనల సందర్భంలోనూ టూల్‌కిట్ సూచనలు పాటించారు. హాంకాంగ్ నిరసనల సందర్భంగా, తమను ఎవరూ గుర్తించకుండా ఉండటానికి, టియర్ గ్యాస్ షెల్స్‌ వేసిన తట్టుకోవడానికి నిరసనకారులు ముసుగులు, హెల్మెట్లు ధరించాలని టూల్‌కిట్లు సూచించాయి. సీఏఏ వ్యతిరేక నిరసనల సమయంలో, ట్విట్టర్ హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించమని సూచించిన టూల్‌కిట్.. నిరసనలు నిర్వహించేందుకు స్థలాలు, పోలీసులు అదుపులోకి తీసుకుంటే ఏం చేయాలన్న అంశాలను అందులో ప్రస్తావించారు. ఇక ప్రస్తుతం ఢిల్లీలో రైతుల నిరసన కార్యక్రమానికి సంబంధించిన ఓ ‘టూల్ కిట్’ డాక్యుమెంట్ కూడా పోలీసుల దృష్టికి వచ్చింది. అందులో ‘ముందస్తు కార్యాచరణ ప్రణాళిక’ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆందోళనల సమయంలో ఎక్కడెక్కడ ఏం చేయాలనేది ఇందులో పేర్కొన్నారని, జనవరి 23న రైతుల ఆందోళనల గురించి భారీగా ట్వీట్లు చేయాలని, 26న ఢిల్లీ సరిహద్దుల వరకు జరిగే ర్యాలీలో పాల్గొనాలనే అంశాలు ఇందులో ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. అయితే జనవరి 26న జరిగిన పరిణామాలు చూస్తుంటే, ఆ టూల్‌కిట్‌లో పేర్కొన్న విషయాలే అమలయ్యాయని వాళ్లు అభిప్రాయపడ్డారు.

థెన్‌బెర్గ్ ప్రస్తావించిన టూల్‌కిట్‌ ట్వీట్‌ను ఆమె డిలీట్ చేయగా.. అందులో అత్యవసర చర్య, ముందస్తు చర్యలు వంటి ఉపవిభాగాలతో పాటు ‘మీరు ఎలా సహాయపడగలరు?’ అనే డీటెయిల్డ్ సెక్షన్ కూడా ఉంది. అత్యవసర చర్యల విభాగంలో.. ఆసక్తిగల వారు ఫిబ్రవరి 4,5 తేదీల్లో ‘ట్విట్టర్ స్టార్మ్’ ప్రారంభించమని టూల్‌కిట్‌లో పొందుపరిచారు. దాంతో పాటు స్క్రాప్‌ఫార్మ్‌యాక్ట్స్ (scrapfarmacts@gmail.com )కు ఇమెయిల్ ద్వారా సంఘీభావం తెలిపే ఫొటో/వీడియో సందేశాన్ని పంచుకోండని, ప్రభుత్వ ప్రతినిధులను పిలవడం/ఇమెయిల్ చేయండని అందులో వివరించారు. అంతేకాదు ‘అదానీ-అంబానీ వంటి గుత్తాధిపతులు, ఒలిగోపాలిస్టుల’ నుండి వైదొలిగి, సమీపంలోని భారతీయ రాయబార కార్యాలయం, మీడియా హౌస్ లేదా స్థానిక ప్రభుత్వ కార్యాలయం ప్రాంతంలో ఫిబ్రవరి 13,14 తేదీల్లో ఆన్-గ్రౌండ్ నిరసనలను నిర్వహించండి అంటూ టూల్‌కిట్‌లో పేర్కొన్నారు.

Tags:    

Similar News