ఇంగ్లాండ్ క్రికెటర్ల చేతులకు నల్లని రిబ్బన్లు.. కారణమేంటి?
దిశ, స్పోర్ట్స్: ఇండియాతో చెన్నైలో శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టులో ఇంగ్లాండ్ క్రికెటర్లు నల్లటి ఆర్మ్ బ్యాండ్స్‌తో బరిలోకి దిగారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతాలాపన సమయంలో ఇంగ్లాండ్ క్రికెటర్ల అందరి చేతులకు ఈ రిబ్బన్లు దర్శనమిచ్చాయి. దీని వెనుక ఉన్న కారణం ఏంటంటే.. బ్రిటిష్ మాజీ సైనికాధికారి, ప్రముఖ వ్యాపారవేత్త కెప్టెన్ టామ్ మోర్ (100) కరోనా బారిన పడి చికిత్స పొందుతూ గత మంగళవారం మృతి చెందాడు. బ్రిటన్‌లో కరోనా కేసులు ప్రారంభమైన […]
దిశ, స్పోర్ట్స్: ఇండియాతో చెన్నైలో శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టులో ఇంగ్లాండ్ క్రికెటర్లు నల్లటి ఆర్మ్ బ్యాండ్స్‌తో బరిలోకి దిగారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతాలాపన సమయంలో ఇంగ్లాండ్ క్రికెటర్ల అందరి చేతులకు ఈ రిబ్బన్లు దర్శనమిచ్చాయి. దీని వెనుక ఉన్న కారణం ఏంటంటే.. బ్రిటిష్ మాజీ సైనికాధికారి, ప్రముఖ వ్యాపారవేత్త కెప్టెన్ టామ్ మోర్ (100) కరోనా బారిన పడి చికిత్స పొందుతూ గత మంగళవారం మృతి చెందాడు. బ్రిటన్‌లో కరోనా కేసులు ప్రారంభమైన తర్వాత అక్కడ లాక్‌డౌన్ విధించారు. ఆ సమయంలో కరోనాపై పోరులో అందరినీ భాగస్యామ్యం చేయాలనే ఉద్దేశంలో ఆయన ఫండ్ రైజింగ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలా ఆయన మిలియన్ డాలర్ల నిధిని ఏర్పాటు చేశారు. అయితే కరోనాపై పోరాడిన ఆయన చివరకు కరోనా బారిన పడి మరణించారు. ఆయనకు నివాళిగా ఇంగ్లాండ్ ఆటగాళ్లు నల్లని రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు.