జేసీ బ్రదర్స్‌కు సీఎం జగన్ చెక్.. ఇదే జరిగితే తాడిపత్రి చైర్మన్ స్థానం వైసీపీదేనా?
దిశ,వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా తాడిపత్రిలో చైర్మన్ స్థానంపై సస్పెన్స్ కొనసాగుతుంది. చైర్మన్ స్థానం ఎవరికి దక్కుతుందోనని ఉత్కంఠ నెలకొంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన టీడీపీ తన పరాజయాల పరంపరను కొనసాగిస్తుంది. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆపార్టీ చరిత్రలోనే ఎన్నడూ చూడనంత పెద్ద పరాజయం ఎదుర్కోవాల్సి వచ్చింది.75 మున్సిపల్, నగర పంచాయతీలతో పాటుగా 12 కార్పోరేషన్లకు ఎన్నికలు జరిగితే.., ఆ ఎన్నికల్లో 85 స్థానాలకు గానూ టీడీపీకి కేవలం తాడిపత్రిలో మాత్రమే స్వల్ప ఆధిక్యంతో […]
దిశ,వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా తాడిపత్రిలో చైర్మన్ స్థానంపై సస్పెన్స్ కొనసాగుతుంది. చైర్మన్ స్థానం ఎవరికి దక్కుతుందోనని ఉత్కంఠ నెలకొంది.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన టీడీపీ తన పరాజయాల పరంపరను కొనసాగిస్తుంది. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆపార్టీ చరిత్రలోనే ఎన్నడూ చూడనంత పెద్ద పరాజయం ఎదుర్కోవాల్సి వచ్చింది.75 మున్సిపల్, నగర పంచాయతీలతో పాటుగా 12 కార్పోరేషన్లకు ఎన్నికలు జరిగితే.., ఆ ఎన్నికల్లో 85 స్థానాలకు గానూ టీడీపీకి కేవలం తాడిపత్రిలో మాత్రమే స్వల్ప ఆధిక్యంతో గెలిచింది. అయితే అక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో తాడిపత్రి చైర్మన్ పీఠం ఎవర్ని వరిస్తోందనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ముందస్తు వ్యూహంలో భాగంగా తాడిపత్రి చైర్మన్ స్థానం కోసం టీడీపీ ఎత్తుకు పై ఎత్తు వేస్తోంది. ఎవరు ప్రలోభాలకు గురికాకుండా చూసేందుకు క్యాంప్ రాజకీయాల్ని షురూ చేసింది. ఇక ప్రస్తుతం టీడీపీకి చెందిన జేసీ క్యాంపులో 20మంది కౌన్సిలర్లు ఉండగా, వైసీపీ దగ్గర 16మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయితే ఎక్స్ అఫిషియో మెంబర్లతో వైసీపీ బలం18 కి చేరింది. దీంతో ఎలాగైనా చైర్మన్ స్థానం దక్కించుకునేందుకు వైసీపీ నేతలు పావులు కదుపుతున్నారు. అందుకే ఇండిపెండెంట్ , సీపీఐ అభ్యర్థుల కోసం వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తుంటే .., తమ అభ్యర్థులను బెదిరిస్తున్నారని టీడీపీ ఆరోపణలు చేస్తోంది.
మరోవైపు టీడీపీలో గెలిచిన కౌన్సిలర్లు వైసీపీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. జేసీ క్యాంపులో ఉన్న కౌన్సిలర్లను పార్టీలోకి ఆహ్వానించేందుకు వైసీపీ అధిష్టానం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఆ ప్రయత్నాలు సఫలమైతే తాడిపత్రి చైర్మన్ స్థానం వైసీపీకి దక్కనుంది.