యూత్ వల్లే కరోనా వ్యాప్తి : డబ్ల్యూహెచ్‌వో
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ దేశాల్లో కరోనా కల్లోలం ఇంకా కుదుట పడలేదు. కొన్ని దేశాల్లో వైరస్ కొద్దిగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ, మరికొన్ని దేశాల్లో ఇప్పుడిప్పుడే దాని వ్యాప్తి తీవ్రస్థాయికి చేరుతోంది. అయితే, కరోనా ఆంక్షలు సడలిస్తున్న దేశాల్లో యువత నైట్‌క్లబ్బులు, బీచ్‌లకు క్యూ కడుతున్నారని, దీనివల్లే కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వెల్లడించింది. కేవలం ఐదు నెలల కాలంలోనే 15 నుంచి 24 ఏళ్ల వయసున్న కరోనా రోగుల సంఖ్య మూడింతలైందని […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ దేశాల్లో కరోనా కల్లోలం ఇంకా కుదుట పడలేదు. కొన్ని దేశాల్లో వైరస్ కొద్దిగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ, మరికొన్ని దేశాల్లో ఇప్పుడిప్పుడే దాని వ్యాప్తి తీవ్రస్థాయికి చేరుతోంది. అయితే, కరోనా ఆంక్షలు సడలిస్తున్న దేశాల్లో యువత నైట్‌క్లబ్బులు, బీచ్‌లకు క్యూ కడుతున్నారని, దీనివల్లే కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వెల్లడించింది.
కేవలం ఐదు నెలల కాలంలోనే 15 నుంచి 24 ఏళ్ల వయసున్న కరోనా రోగుల సంఖ్య మూడింతలైందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఫిబ్రవరి జులై మధ్య కాలంలో ఈ వయసుల వారిలో కరోనా కేసుల శాతం 4.5 నుంచి 18కి పెరిగిందని ప్రకటించింది. ఇటీవల యువత ఎక్కువగా కరోనా బారినపడుతున్నారని అమెరికాతో పాటూ స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, దేశాల ప్రభుత్వాలు ప్రకటించినట్లు డబ్ల్యూహెచ్ఓ గుర్తుచేసింది.
‘భౌతిక దూరం, మాస్కు ధరించడం వంటి ముందు జాగ్రత్తల విషయంలో యువత అశ్రద్ధ కనబరుస్తున్నారు’ అని నిపుణులు చెబుతున్నారు. వృత్తి రీత్యా లేదా ఇతరత్రా కారణాలతో యువత అధికంగా ప్రయాణాలు చేస్తూ కరోనా బారిన పడుతున్నారని వారు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా యువత జాగ్రత్తలు పాటించకపోతే రానున్న రోజుల్లో కరోనా విలయాన్ని ఊహించలేమని తెలిపింది.