అగ్రరాజ్య అధ్యక్ష వేడుకల్లో మెరిసిన ‘అమండా’

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయగా, ఆ వేడుకలను యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా చూసింది. అగ్రరాజ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరే ముందు ప్రముఖ పాప్ గాయని లేడీగాగా అమెరికా జాతీయ గీతాన్ని ఆలపించింది. ఈ వేడుక సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ హాలీవుడ్ నటి జెన్నీఫర్ లోపెజ్ ప్రత్యేక ప్రదర్శన ఇవ్వగా, 2017 యూత్ పోయెట్ లారెట్ అవార్డ్ గ్రహీత అమండా గోర్మాన్ ‘ది హిల్ […]

Update: 2021-01-21 01:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయగా, ఆ వేడుకలను యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా చూసింది. అగ్రరాజ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరే ముందు ప్రముఖ పాప్ గాయని లేడీగాగా అమెరికా జాతీయ గీతాన్ని ఆలపించింది. ఈ వేడుక సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ హాలీవుడ్ నటి జెన్నీఫర్ లోపెజ్ ప్రత్యేక ప్రదర్శన ఇవ్వగా, 2017 యూత్ పోయెట్ లారెట్ అవార్డ్ గ్రహీత అమండా గోర్మాన్ ‘ది హిల్ వి క్లైమ్’ అనే కవితను చదివి వినిపించారు. 22 ఏళ్ల ఆఫ్రికన్ అమెరికన్ రచయిత్రి అమండా ప్రదర్శన ఆహూతులను అలరించగా, ఆమె కవిత సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఆ యువ సంచలనం ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి?

యునైటెడ్ స్టేట్స్ అధ్యక్ష ప్రారంభోత్సవంలో ప్రదర్శన ఇచ్చిన అతి పిన్న వయస్కురాలు అమండా గోర్మాన్. ఆమె ‘ది హిల్ వి క్లైమ్’ కవిత సెర్మనీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గోర్మాన్..లాస్ ఏంజిల్స్‌లో పుట్టి పెరగగా, హార్వార్డ్‌ యూనివర్సిటీలో సోషియాలజీని అభ్యసించింది. నోబెల్ గ్రహీత, పాకిస్తానీ యాక్టివిస్ట్ మలాలా యూసఫ్‌జాయ్ ప్రసంగాలకు ప్రేరణ పొందిన గోర్మాన్.. తన గొంతును ఈ లోకానికి వినిపించాలనుకుంది. ఆ క్రమంలో తన కవితలతో..2017లో యూత్ పోయెట్ లారెట్ అవార్డ్ అందుకుని ప్రపంచానికి తన కవి హృదయాన్ని పరిచయం చేసింది. ‘అమెరికా ప్రస్తుతం గజిబిజిగా ఉంది. అభివృద్ధి ఇంకా ప్రారంభదశలో ఉందన్నది అందరికీ తెలిసిన విషయమే. నేను దాన్ని విస్మరించలేను, తొలగించలేను, అందుకే ఆ అంశాలకు నా కవితలో చోటిచ్చాను. ఆ మాయని మచ్చలు, గాయాలను గుర్తుచేస్తూనే, ఆశాజనకంగా ముందుడుగు వేసే క్రమంలో అవి సమసిపోతాయనే విషయాన్ని స్పష్టం చేశాను’ అని గోర్మాన్ తెలిపింది.

లాస్ ఏంజిల్స్ యువ కవిగా పేరొందిన గోర్మాన్..2015లో ‘ది వన్ ఫర్ హూమ్ ఫుడ్ ఈజ్ నాట్ ఎనఫ్’ (The One for Whom Food Is Not Enough )అనే పేరుతో తన మొదటి కవితా సంకలనాన్ని వెలువరించింది. 22వ యూఎస్ పోయెట్ లారెట్, హార్వార్డ్ 29వ అధ్యక్ష ప్రారంభోత్సవంలో ఆమె తన కవితలను వినిపించి అందరి ప్రశంసలు అందుకుంది. ఆమె కవితలు ప్రపంచంలోని అసమానతలు, అణచివేతలు,జాత్యహంకార ధోరణులు, వివక్షను ఎత్తిచూపుతాయి. 2036లో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావిస్తున్నట్లు గతంలో చెప్పిన గోర్మాన్..శ్వేతసౌధానికి మళ్లీ తిరిగి వస్తానని తన మనసులో మాట చెప్పినట్లు సమాచారం.

Tags:    

Similar News