పుల్వామా దాడి ఎవరికి లాభం: రాహుల్
పుల్వామా దాడి జరిగి సరిగ్గా నేటికి ఏడాది కావడంతో, ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు సామాజిక మాద్యమాల వేదికగా యావత్ భారతం నివాలులర్పిస్తున్నది. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సైతం ట్విట్టర్ వేదికగా అమరవీరులకు నివాలులర్పిస్తూ.. కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరులను స్మరించుకుంటున్న వేళ.. మనం కొన్ని ప్రశ్నలు లేవనెత్తుదాం. ఈ దాడి వల్ల ఎవరు లాభపడ్డారు. దీనిపై విచారణలో […]
పుల్వామా దాడి జరిగి సరిగ్గా నేటికి ఏడాది కావడంతో, ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు సామాజిక మాద్యమాల వేదికగా యావత్ భారతం నివాలులర్పిస్తున్నది. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సైతం ట్విట్టర్ వేదికగా అమరవీరులకు నివాలులర్పిస్తూ.. కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరులను స్మరించుకుంటున్న వేళ.. మనం కొన్ని ప్రశ్నలు లేవనెత్తుదాం. ఈ దాడి వల్ల ఎవరు లాభపడ్డారు. దీనిపై విచారణలో ఏం వెల్లడైంది. దాడి జరగడానికి కారణమైన భద్రతాలోపాలపై బీజేపీ ప్రభుత్వంలో ఎవరు జవాబుదారిగా ఉంటారు’ అంటూ నిలదీశారు. కాగా, గతేడాది ఫిబ్రవరి 14న కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.