అమెరికా : మహమ్మారి ఓవైపు.. తుఫాను మరో వైపు
వాషింగ్టన్ : మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు.. ఇప్పటికే కరోనా విలయంతో విల్లవిల్లాడుతున్న అమెరికాకు తుఫాను రూపంలో మరో విపత్తు అటాక్ చేస్తున్నది. కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించిన అమెరికా దాని కట్టడికి సాధ్యమైనంతమేర చర్యలు తీసుకుంటున్నది. ఇదిలా ఉండగా.. అమెరికాలోని ఉత్తర లూసియానాలో ఒకేసారి అధిక సంఖ్యలో టోర్నడోలు విరుచుకపడుతున్నాయి. దీంతో ఇండ్లు, బహుల అంతస్తుల భవనాలు దెబ్బతింటున్నాయి. తుఫాను తాకిడికి సౌత్ మిసిసిపి రాష్ట్రంలో ఆరుగురు మృతి చెందినట్లు స్థానిక ప్రభుత్వం వెల్లడించింది. ఆ […]
వాషింగ్టన్ : మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు.. ఇప్పటికే కరోనా విలయంతో విల్లవిల్లాడుతున్న అమెరికాకు తుఫాను రూపంలో మరో విపత్తు అటాక్ చేస్తున్నది. కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించిన అమెరికా దాని కట్టడికి సాధ్యమైనంతమేర చర్యలు తీసుకుంటున్నది. ఇదిలా ఉండగా.. అమెరికాలోని ఉత్తర లూసియానాలో ఒకేసారి అధిక సంఖ్యలో టోర్నడోలు విరుచుకపడుతున్నాయి. దీంతో ఇండ్లు, బహుల అంతస్తుల భవనాలు దెబ్బతింటున్నాయి. తుఫాను తాకిడికి సౌత్ మిసిసిపి రాష్ట్రంలో ఆరుగురు మృతి చెందినట్లు స్థానిక ప్రభుత్వం వెల్లడించింది. ఆ రాష్ట్రంలోని ప్రధాన నగరమైన వాల్తాల్‌లో ఒకరు, లారెన్స్‌లో ఇద్దరు, జెపరెన్స్‌దేవ్‌లో ముగ్గురు చనిపోయారు. టొర్నడోలల తీవ్రత కారణంగా మండ్రో విమానాశ్రయంలో భవనాలు, చెట్లు కూలిపోయి రన్‌వేను ధ్వంసం చేశాయి. ఆ రాష్ట్రంలో భారీ చెట్లు కూలిపోయాయి. కాగా, మండ్రో విమానాశ్రయానికి 30 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు డైరెక్టర్ వెల్లడించారు. మరోవైపు అలబామా, వెస్ట్ జార్జియా, ఈస్ట్ టెక్సాస్ తీరం వరకు విస్తరించి ఉన్న ప్రాంతాలకు తుఫాను ముప్పు పొంచి ఉందని.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ ప్రాంతాల్లో ఇప్పటికే కరోనా కేసులు నమోదవుతున్నందునా.. ప్రజలు దాని పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాలని.. అత్యవసర సాయం కోసం ఇప్పటికే ప్రభుత్వ బృందాలు రంగంలోనికి దిగినట్లు అధికారులు తెలిపారు.
Tags: america, coronavirus, pandemic, tornado, strike, hit