జంప్ జిలానీలు.. మొన్న గంగుల.. నేడు ఈటల!

దిశ ప్రతినిధి, కరీంనగర్: రెండు రోజుల క్రితం జై కేసీఆర్ అని నినదించిన వారే నేడు మళ్లీ జై ఈటల నినాదం అందుకున్నారు. టీఆర్ఎస్ లోనే కొనసాగుతామని ప్రకటించిన వారే నేడు ఈటలకు మద్దతు ఇస్తున్నామని చెప్తున్నారు. హుజురాబాద్ కేంద్రంగా జరుగుతున్న విచిత్ర రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. వీణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుక భర్త తిరుపతి రెడ్డి ఆదివారం కరీంనగర్ లోని మంత్రి గంగుల కమలాకర్ ను కలిశారు. తాము టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతామని ప్రకటించారు. అయితే […]

Update: 2021-05-18 02:24 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: రెండు రోజుల క్రితం జై కేసీఆర్ అని నినదించిన వారే నేడు మళ్లీ జై ఈటల నినాదం అందుకున్నారు. టీఆర్ఎస్ లోనే కొనసాగుతామని ప్రకటించిన వారే నేడు ఈటలకు మద్దతు ఇస్తున్నామని చెప్తున్నారు. హుజురాబాద్ కేంద్రంగా జరుగుతున్న విచిత్ర రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. వీణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుక భర్త తిరుపతి రెడ్డి ఆదివారం కరీంనగర్ లోని మంత్రి గంగుల కమలాకర్ ను కలిశారు. తాము టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతామని ప్రకటించారు. అయితే సరిగ్గా రెండు రోజులు కూడా గడవకముందే మంగళవారం హుజురాబాద్ పర్యటనకు వచ్చిన ఈటల సమక్షంలో ఎంపీపీ రేణుక దంపతులు ప్రత్యక్ష్యం అయ్యారు.

దీంతో హుజురాబాద్ లో ఏం జరుగుతుందోనన్న చర్చ మొదలైంది. ఎవరు టీఆర్ఎస్ లో ఉన్నారు..? ఎవరు ఈటల పంచన చేరారో అర్థం కాకుండా పోతోంది. రాజేందర్ హుజురాబాద్ కు చేరుకున్న గంటసేపటిలోగానే వీణవంక ఎంపీపీ నేరుగా ఆయన వద్దకు వచ్చి తన మద్దతు ప్రకటింటించడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News