పెళ్లిలో వరుడి తల్లి చేసిన ఆ పనికి షాక్‌లో వధువు.. వీడియో వైరల్
దిశ, వెబ్‌డెస్క్ : మండపంలో ఘనంగా పెళ్లి వేడుక జరుగుతోంది. పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు ఆనందంలో ఒకరితో ఒకరు ముచ్చటిస్తున్నారు. ఇంతలోనే పెళ్లి వేడుకలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే వరుడి తల్లి.. పెళ్లి కొడుకును చెప్పుతో కొట్టి ఘోరంగా అవమానించింది. దీంతో, అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని హమీర్‌పుర్‌లోని సుమేర్‌పుర్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకుంటున్నాడన్న కారణంతో పెళ్లి వేడుకలో వరుడిని ఆమె […]
దిశ, వెబ్‌డెస్క్ : మండపంలో ఘనంగా పెళ్లి వేడుక జరుగుతోంది. పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు ఆనందంలో ఒకరితో ఒకరు ముచ్చటిస్తున్నారు. ఇంతలోనే పెళ్లి వేడుకలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే వరుడి తల్లి.. పెళ్లి కొడుకును చెప్పుతో కొట్టి ఘోరంగా అవమానించింది. దీంతో, అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని హమీర్‌పుర్‌లోని సుమేర్‌పుర్‌లో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకుంటున్నాడన్న కారణంతో పెళ్లి వేడుకలో వరుడిని ఆమె తల్లి అందరూ చూస్తుండగానే చెప్పుతో కొట్టింది. పెళ్లి వేడుకలో భాగంగా.. వధూవరులు పూల దండలు మార్చుకుంటున్న సమయంలో ఒక్కసారిగా వేదిక మీదకు వచ్చిన వరుడి తల్లి.. ఫోటోగ్రాఫర్‌ను పక్కకు నెట్టి.. కుమారుడిపై చెప్పులు విసిరింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
In #Hamirpur district of #UttarPradesh , woman attempted to ransack the rotating lotus podium during 'jaymala' ceremony of her son & rained slippers on him. The groom's family was allegedly unhappy over the marriage. Incident took place in Samerpur police limits. pic.twitter.com/KowPqcRnsX
— Arvind Chauhan (@Arv_Ind_Chauhan) July 5, 2021