Russia : అణు యుద్ధాలకు సిద్ధంగా ఉండండి : రష్యా హెచ్చరిక
పశ్చిమ దేశాలు(West Countries) అణు యుద్ధాల(Nuclear wars)కు సిద్ధంగా ఉండాలని రష్యా(Russia) హెచ్చరికలు జారీ చేసింది.
దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమ దేశాలు(West Countries) అణు యుద్ధాల(Nuclear wars)కు సిద్ధంగా ఉండాలని రష్యా(Russia) హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా, యూరప్ దేశాలు ఉక్రెయిన్(Ukrain) కు అణ్వాయుధాలు సరఫరా చేసి భారీ యుద్ధానికి తెరలేపారని రష్యన్ సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ డిమిత్రి మెద్వదేవ్(Dimitri Medvadev) తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రపంచంలోని ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తీసేందుకు సిద్ధమయ్యారని అన్నారు. మాపై అణ్వాయుధాలు ప్రయోగిస్తే జరగబోయే పరిణామాలకు పశ్చిమ దేశాలు సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఇటీవల అమెరికా, యూరప్ వర్గాలు ఉక్రెయిన్ కు అణు ఆయుధాలు సరఫరా చేసేందుకు సిద్ధమవుతున్నట్టు న్యూయార్క్ టైమ్స్ కథనాలు రాసింది. అలాగే బ్రిటన్ భారీగా క్షిపణులకు ఉక్రెయిన్ కి తరలించింది. రష్యాపై క్షిపణుల దాడికి పశ్చిమ దేశాలు కీవ్ కు అనుమతులు ఇచ్చినట్టు సమాచారం. దీంతో తాము కూడా అణ్వాయుధాలను వాడేందుకు సిద్ధమవుతున్నట్టు రష్యా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.