KumbhMela 2025: కుంభమేళాలో తొలిసారిగా రోబోలు..!

ప్రయాగ్‌రాజ్‌లో జరిగే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనమైన మహా కుంభమేళా (KumbhMela)కు ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ప్రభుత్వం అన్ని విధాలా ఏర్పాట్లు చేస్తోంది.

Update: 2024-11-26 10:13 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రయాగ్‌రాజ్‌లో జరిగే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనమైన మహా కుంభమేళా (KumbhMela)కు ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ప్రభుత్వం అన్ని విధాలా ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు రెడీ చేస్తున్నారు. అయితే, కుంభమేళాలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రోబోటిక్‌ ఫైర్‌ టెండర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా 200 అగ్నిమాపక కమాండోలను సైతం ఉంచనున్నట్లు తెలిపారు. ఈ వివరాలను ప్రయాగ్ రాజ్ అడిషనల్‌ డైరెక్టర్ జనరల్‌ పద్మజా చౌహాన్‌ మీడియాకు తెలిపారు. ‘అత్యవసర సమయాల్లో సిబ్బంది చేరుకోలేని ప్రాంతాలకు వెళ్లేందుకు మూడు రోబోటిక్‌ ఫైర్‌ టెండర్లను వాడుతాం. ఒక్కొక్క రోబో 20 నుంచి 25 కిలోల బరువుంటుంది. ఈ రోబోలు మెట్లు ఎక్కడంతో పాటు మంటలను కూడా అదుపు చేస్తాయి. దీంతోపాటు 35 మీటర్ల ఎత్తు నుంచి నీటిని స్ప్రే చేసే ఆర్టిక్యూలేటింగ్‌ వాటర్‌ టవర్‌లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కెమెరాలు ఏర్పాటు చేశాం’ అని పేర్కొన్నారు.

ప్రత్యేక ఏర్పాట్లు

వచ్చే ఏడాది జరిగే కుంభమేళా ఏర్పాట్ల కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ తరహాలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న ఎస్‌టీఆర్‌జీని ప్రారంభించినట్లు ప్రయాగ్ రాజ్ ఏడీజీ తెలిపారు. ఈ యూనిట్‌లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) హైదరాబాద్‌లో శిక్షణ పొందిన 200 మంది సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. వారు జాతర సమయంలో హై రిస్క్‌ జోన్‌లలో మోహరిస్తారని పేర్కొన్నారు. అగ్నిమాపక సేవల కోసం గత కుంభమేళాకు రూ.6 కోట్లు కేటాయించగా.. ప్రస్తుతం దాన్ని రూ.67 కోట్లకు పెంచినట్లు తెలిపారు.

Tags:    

Similar News