Madhya Pradesh : నడుస్తున్నప్పుడు హెల్మెట్ ధరించలేదని వ్యక్తికి జరిమానా..!
నడుస్తున్నప్పుడు హెల్మెట్ ధరించలేదని(walking without a helmet) ఓ వ్యక్తికి పోలీసులు జరిమానా విధించిన ఘటన సంచలనంగా మారింది.
దిశ, నేషనల్ బ్యూరో: నడుస్తున్నప్పుడు హెల్మెట్ ధరించలేదని(walking without a helmet) ఓ వ్యక్తికి పోలీసులు జరిమానా విధించిన ఘటన సంచలనంగా మారింది. హెల్మెట్ దరించలేదు సుశీల్ కుమార్ శుక్లా అనే వ్యక్తికి పోలీసులు రూ.300 జరిమానా విధించారు. మధ్యప్రదేశ్(Madhya Pradesh) లోని పన్నా జిల్లాలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. అజయ్‌గఢ్ పోలీస్ స్టేషన్(Ajaygarh police station) ప్రాంతంలో సుశీల్ కుమార్ శుక్లా అనే తమ కుమార్తె పుట్టినరోజు కోసం బంధువులను ఆహ్వనించేందుకు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లారు. అయితే, అప్పుడే రోడ్డుపైన ఓ పోలీస్ వాహనం తనని ఆపిందని సుశీల్ తెలిపాడు. ఆ తర్వాత, తనను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి అజయ్‌గఢ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి నిర్బంధించారని ఆరోపించారు. తాను నడుస్తున్నప్పుడు సమీపంలో పార్క్ చేసిన మోటార్‌సైకిల్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను రాసుకుని, హెల్మెట్ లేకుండా ప్రయాణించినందుకు అతనికి జరిమానా విధించినట్లు పేర్కొన్నాడు. దీంతో, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుశీల్ కుమార్ శుక్లా పన్నా జిల్లా ఎస్పీని ఆశ్రయించాడు. ఈ ఘటనపై సమగ్రదర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. అయితే, ఈ ఫిర్యాదుపై ఎస్పీ స్పందించారు. దర్యాప్తు ప్రారంభించామని.. ఈ కేసుని అజయ్‌గఢ్‌లోని సబ్-డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ (SDOP) రాజీవ్ సింగ్ భదౌరియాకు అప్పగించినట్లు వెల్లడించారు. ప్రాథమిక వివరాలు అసంపూర్ణంగా ఉన్నాయని గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. దర్యాప్తు ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.