Delhi Assembly : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Election)కు సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల(Notification Released)చేసింది.

Update: 2025-01-10 07:49 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Election)కు సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల(Notification Released)చేసింది. ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ(Nominations Accepted From Today) ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 17వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. 18న నామినేషన్ల పరిశీలన, ఈనెల 20 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది. 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ వచ్చే నెల ఫిబ్రవరి 5న జరుగనుంది. 8వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.

ఢిల్లీలో 1.55 కోట్ల ఓటర్లు ఉన్నారని, వీరిలో 83.49 లక్షల పురుష ఓటర్లు, 71.74 లక్షల మహిళా ఓటర్లు ఉన్నారని, ఐదోసారి ఓటింగ్‌లో పాల్గొంటున్న వారు 2.08 లక్షల మంది ఉన్నారని ఇప్పటికే ఎన్నికల సంఘం పేర్కొంది. 25.89 లక్షల మంది యువ ఓటర్లు (20-29) ఉన్నట్టు తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం 13,033 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లుగా వెల్లడించింది.

కాగా ఎన్నికల కోసం ఇప్పటికే అధికార ఆమ్ఆద్మీ పార్టీ 70మంది స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ తొలి జాబితాలో 29మందిని ప్రకటించింది. మిగిలిన 41స్థానాలకు ఈ రోజు శుక్రవారం అభ్యర్థులను ప్రకటించనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నేతలంతా ఈ భేటీకి హాజరవుతారు.

ఈ రోజు రాత్రి లేదా శనివారం ఉదయం ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశమున్నట్లు తెలియవచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా నాల్గవ సారి అధికార సాధనకు ఆప్ పార్టీ, ఈ దఫానైనా అధికారంలోకి రావాలని బీజేపీ హోరాహోరిగా తలపడుతున్నాయి.

Tags:    

Similar News