వాట్సాప్ పేమెంట్స్ కోసం బ్యాంకులతో ఒప్పందం!
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల వాట్సాప్ పేమెంట్స్‌కు కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. దీని తర్వాత దేశీయంగా 2 కోట్ల మంది యూజర్లు వాట్సాప్ యూపీఐ సేవలను వినియోగిస్తున్నారు. తాజాగా దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులతో ఒప్పందం చేసుకున్నట్టు వాట్సాప్ ప్రకటించింది. వాట్సాప్ లావాదేవీలకు ఎన్‌పీసీఐకి చెందిన యూపీఐ అందుబాటులోకి ఉంటుందని కంపెనీ పేర్కొంది. దీనిద్వారా సురక్షితంగా, సౌకర్యవంతంగా నగదును పంపే వీలుంటుందని తెలిపింది. నేరుగా స్థానిక బ్యాంకులకు వెళ్లకుండా […]
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల వాట్సాప్ పేమెంట్స్‌కు కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. దీని తర్వాత దేశీయంగా 2 కోట్ల మంది యూజర్లు వాట్సాప్ యూపీఐ సేవలను వినియోగిస్తున్నారు. తాజాగా దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులతో ఒప్పందం చేసుకున్నట్టు వాట్సాప్ ప్రకటించింది. వాట్సాప్ లావాదేవీలకు ఎన్‌పీసీఐకి చెందిన యూపీఐ అందుబాటులోకి ఉంటుందని కంపెనీ పేర్కొంది. దీనిద్వారా సురక్షితంగా, సౌకర్యవంతంగా నగదును పంపే వీలుంటుందని తెలిపింది.
నేరుగా స్థానిక బ్యాంకులకు వెళ్లకుండా సులభంగా నగదును పంపేందుకు ఈ నాలుగు బ్యాంకులతో ఒప్పందం చేసుకున్నట్టు వాట్సాప్ తెలిపింది. డిజిటల్ ఎకానమీ ప్రయోజనాలను ఎక్కువమందికి అందించడానికి ప్రయత్నిస్తున్నామని వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ చెప్పారు. వాట్సాప్ పేమెంట్స్ సుమారు 160 బ్యాంకులకు సపోర్ట్ చేస్తుంది. ప్రతి నెలా యూపీఐ లావాదేవీల సంఖ్య పెరుగుతోంది. ఎస్‌బీఐకి 12 కోట్ల మంది యూపీఐ యూజర్లు ఉన్నారు, ఇది మొత్తం యూపీఐ యూజర్ల సంఖ్యలో 28 శాతం ఉంటుంది. ఇటీవల గణాంకాల ప్రకారం ఈ ఏడాది నవంబర్‌లో 223 కోట్ల లావాదేవీలు జరగ్గా, ఇది అక్టోబర్‌తో పోలిస్తే 6.7 శాతం అధికమని తేలింది.