అగ్ర అధ్యక్షుడికి.. టర్కీ కోళ్ల బహుమానం
దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా అధ్యక్షుడు ఎవరు? అంటే ప్రస్తుతానికైతే ట్రంప్. జో బైడెన్ విజయాన్ని ఎట్టకేలకు ఒప్పుకున్న ట్రంప్ శ్వేతసౌధంలో జరిగిన ‘థ్యాంక్స్ గివింగ్’ పార్టీలో మెలానియాతో కలిసి పాల్గొన్నాడు. అయితే అంతకుముందు ‘థ్యాంక్స్ గివింగ్ టర్కీ’ సెర్మనీ జరిగింది. అందులో భాగంగా టర్కీ కోడిని క్షమించి వదిలేశాడు ట్రంప్. అసలు ‘థ్యాంక్స్ గివింగ్ టర్కీ’ ఏంటి? ట్రంప్ కోడిని క్షమించడమేంటి? ‘థ్యాంక్స్ గివింగ్ టర్కీ ప్రజెంటేషన్’ అనే సంప్రదాయం 1870లో మొదలైంది. ఇందులో భాగంగా […]
దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా అధ్యక్షుడు ఎవరు? అంటే ప్రస్తుతానికైతే ట్రంప్. జో బైడెన్ విజయాన్ని ఎట్టకేలకు ఒప్పుకున్న ట్రంప్ శ్వేతసౌధంలో జరిగిన ‘థ్యాంక్స్ గివింగ్’ పార్టీలో మెలానియాతో కలిసి పాల్గొన్నాడు. అయితే అంతకుముందు ‘థ్యాంక్స్ గివింగ్ టర్కీ’ సెర్మనీ జరిగింది. అందులో భాగంగా టర్కీ కోడిని క్షమించి వదిలేశాడు ట్రంప్. అసలు ‘థ్యాంక్స్ గివింగ్ టర్కీ’ ఏంటి? ట్రంప్ కోడిని క్షమించడమేంటి?
‘థ్యాంక్స్ గివింగ్ టర్కీ ప్రజెంటేషన్’ అనే సంప్రదాయం 1870లో మొదలైంది. ఇందులో భాగంగా అమెరికాలోని పలు ప్రాంతాల రైతులు తమ కోళ్లను అధ్యక్షులకు బహుమతిగా పంపించేవాళ్లు. ఆ తర్వాత పౌల్ట్రీ ఇండస్ట్రీ లాబీయింగ్ కోసం రైతులు ప్రతి ఏటా టర్కీ కోళ్లను అధ్యక్షుడికి పంపిస్తుండేవారు. అలా1947లో ప్రెసిడెంట్ హ్యారీ ఎస్ ట్రూమన్ ఆధ్వర్యంలో ఇదో సంప్రదాయంగా మారింది. ఆ తర్వాత నాన్ ప్రాఫిట్ నేషనల్ ట్రేడ్ అసోసియేషన్ అయిన ‘నేషనల్ టర్కీ ఫెడరేషన్’(ఎన్‌టీఎఫ్).. అమెరికా అధ్యక్షుడికి టర్కీ కోళ్లను బహుమతిగా ఇచ్చే సంప్రదాయాన్ని కొనసాగించింది. అధ్యక్షుడు బహుమతిగా పొందిన ఆ కోళ్లను థ్యాంక్స్ గివింగ్ డిన్నర్‌లో వండుకుని తినేవాళ్లు. కానీ చాలామంది అధ్యక్షులు వాటిని తినకుండా ‘జూ’కు అప్పగించేవాళ్లు. 1987లో రోనాల్డ్ రీగన్.. థ్యాంక్స్ గివింగ్ టర్కీ ప్రజెంటేషన్ సెర్మనీకి ‘పార్డనింగ్’ పదాన్ని చేర్చి, ఆ కోడిని తినకుండా క్షమించి వదిలేశాడు. ఆ తర్వాత జార్జి హెచ్‌డబ్ల్యూ బుష్ ‘టర్కీ పార్డన్’ అనేది ప్రజెంటేషన్‌లో పర్మినెంట్ పార్ట్ అని అధికారికంగా ప్రకటించాడు. ఇక అప్పటి నుంచి ఆ ఈవెంట్ ‘ద ప్రెసిడెన్షియల్ టర్కీ పార్డన్’గా మారింది. అమెరికా వ్యాప్తంగా ‘థ్యాంక్స్ గివింగ్’ను నవంబర్ నాలుగో గురువారం జరుపుకుంటారు. అయితే అంతకుముందే వైట్‌హౌజ్‌లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దీనికి ఒక రోజు ముందు థ్యాంక్స్ గివింగ్ టర్కీ సెర్మనీ జరుగుతుంది.
On behalf of the entire Trump Family, I want to wish every American a Healthy and Happy Thanksgiving! Today we gathered in the Rose Garden to continue a beloved annual tradition: the Official Presidential Pardon of a very fortunate Thanksgiving Turkey…. pic.twitter.com/O92pWUKrBv
— Donald J. Trump (@realDonaldTrump) November 24, 2020
ఇందుకోసం 50 టర్కీలను ప్రత్యేకంగా పెంచేవాళ్లు. అంతేకాదు ఆ కోళ్లు క్రౌడ్‌ను చూసి అరవకుండా బెదరకుండా ఉండేందుకు ట్రైయినింగ్ ఇచ్చేవాళ్లు. కెమెరా ఫ్లాష్ లైట్స్, స్టడీగా నిల్చోవడం తదితర విషయాల్లో తర్ఫీదు ఇవ్వడం ద్వారా ఆ కోళ్లు వైట్‌హౌజ్ సెర్మనీలో చక్కగా హ్యాపీగా కూర్చునేవి. ఆ 50 టర్కీ కోళ్లలో రెండింటిని ఎంపిక చేసి ప్రెసిడెంట్‌కు బహుమతిగా ఇస్తారు. 1999లో క్లింటన్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ఆ టర్కీ కోళ్లకు పేర్లు పెట్టే సంప్రదాయం మొదలైంది. అలా ఓ టర్కీ కోడికి ‘హ్యారీ’ అనే పేరు పెట్టారు. ఈ ఏడాది ‘కార్న్, కోబ్’ వైట్‌హౌజ్‌లో జరిగిన ‘థ్యాంక్స్ గివింగ్ టర్కీ’కి ఎంపికయ్యాయి. గతంలో ‘బటర్ అండ్ బ్రెడ్, పీస్ అండ్ కారెట్స్, డ్రమ్‌స్టిక్స్ అండ్ విష్‌బోన్’లు ఈ థ్యాంక్స్ గివింగ్‌లో నిలిచాయి. మొదట ఎంపిక చేసిన ఆ కోళ్ల జతను రాజధాని వాషింగ్టన్ డీసీలోని లగ్జరీ విల్లార్డ్ హోటల్‌లో ఉంచుతారు.
శ్వేతసౌధంలోని రోజ్‌గార్డెన్‌లో జరిగిన థ్యాంక్స్ గివింగ్ టర్కీ కార్యక్రమంలో ట్రంప్ తనదైన శైలిలో జోకులు వేస్తూ చాలా చాలా ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా ‘కార్న్ (Corn), కోబ్(Cob)’ టర్కీ కోళ్లను క్షమించి వదిలేశాడు. అధ్యక్షులు టర్కీ కోళ్లను విందు కోసం ఉపయోగించుకోవచ్చు లేదా వాటికి క్షమాభిక్ష పెట్టొచ్చు. అమెరికా అధ్యక్షులు జాన్ ఎఫ్ కెనడీ, రిచర్డ్ నిక్సన్, జిమ్మీ కార్టర్ కోళ్లను తినకుండా క్షమించి వదిలేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ తనకు బహుమతిగా వచ్చిన టర్కీ కోడికి ‘జాక్’ అని పేరుపెట్టి చాలా ప్రేమగా పెంచుకోవడం విశేషం. కాగా ట్రంప్ క్షమించి వదిలేసిన టర్కీ కోళ్లు ‘కార్న్, కోబ్’ను ఐయోవా యూనివర్సిటీకి తరలించారు. అవి అక్కడే హ్యాపీగా పెరుగుతాయి.