రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

దిశ, తుంగతుర్తి: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కుంచమర్తి గ్రామంలోని గోడౌన్‎లో ఉన్న 5 వేల మెట్రిక్ టన్నుల నిల్వ మక్కలను సామేల్ పరిశీలించారు. ఈ సందర్భంగా గోడౌన్ స్థల దాతను సన్మానించారు. అనంతరం నూతనకల్ మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లా గిడ్డంగుల సంస్థ ఆర్ఎం జయప్రకాష్ రెడ్డి, మేనేజర్ […]

Update: 2020-10-08 08:25 GMT

దిశ, తుంగతుర్తి: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కుంచమర్తి గ్రామంలోని గోడౌన్‎లో ఉన్న 5 వేల మెట్రిక్ టన్నుల నిల్వ మక్కలను సామేల్ పరిశీలించారు. ఈ సందర్భంగా గోడౌన్ స్థల దాతను సన్మానించారు. అనంతరం నూతనకల్ మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లా గిడ్డంగుల సంస్థ ఆర్ఎం జయప్రకాష్ రెడ్డి, మేనేజర్ అశోక్ రెడ్డి, ఎంపీపీ మన్నెం రేణుక లక్ష్మీ నర్సింహయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మందుల సామేల్ మాట్లాడుతూ… దుబ్బాక ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే పార్టీకి విజయం చేకూరుస్తాయని తెలిపారు. రామలింగారెడ్డి అకాల మృతి దుబ్బాక నియోజక వర్గ ప్రజలకు, టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు. ప్రజలకు రామలింగారెడ్డి చేసిన సేవలే ఆయన సతీమణి సుజాతను అధిక మెజారిటీతో గెలిపిస్తారని అన్నారు.

Tags:    

Similar News