నియోజకవర్గానికో స్టేడియం : మంత్రి శ్రీనివాస్ ‌గౌడ్

దిశ, మహబూబ్‌నగర్ : ప్రతి నియోజకవర్గంలో స్టేడియంలను నిర్మిస్తామని, పట్టణంలోని ప్రధాన అంతర్గత రహదారులన్నింటిలో సీసీ రహదారులు వేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శనివారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో షా షాబ్ గుట్ట చౌరస్తా నుండి శివాలయం వరకు చేపట్టిన సీసీ రహదారి పనుల పురోగతిని, స్టేడియంలో చేపట్టిన అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న కూడళ్ల […]

Update: 2021-08-21 08:12 GMT

దిశ, మహబూబ్‌నగర్ : ప్రతి నియోజకవర్గంలో స్టేడియంలను నిర్మిస్తామని, పట్టణంలోని ప్రధాన అంతర్గత రహదారులన్నింటిలో సీసీ రహదారులు వేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శనివారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో షా షాబ్ గుట్ట చౌరస్తా నుండి శివాలయం వరకు చేపట్టిన సీసీ రహదారి పనుల పురోగతిని, స్టేడియంలో చేపట్టిన అభివృద్ధి పనులను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న కూడళ్ల పనులను త్వరగా పూర్తి చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్‌ను ఆదేశించారు. షా షాబ్ గుట్ట సీసీ రహదారితో పాటు పట్టణంలోని ఇతర రహదారులు కూడా ప్రజలకు సౌకర్యంగా ఉండేలా సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట రావు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, మున్సిపల్ కమిషనర్ కేసీ నర్సింహులు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ, పీఆర్ఈఈ నరేందర్, కౌన్సిలర్లు అంజాద్, రామ్ లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News