‘కోహ్లీసేనతో చేతులు కలపం’

కరోనా వైరస్ క్రీడారంగాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. కొన్ని దేశాల క్రికెట్ జట్లు విదేశీ పర్యటనలు రద్దు చేసుకుంటున్నాయి. మరికొన్ని జట్లు విదేశీ పర్యటనలకు వెళ్తున్నా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. త్వరలో దక్షిణాఫ్రికా జట్టు భారత్ లో పర్యటించనుంది. కరోనాకు దూరంగా ఉండేందుకు తమ జట్టు సభ్యులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారని దక్షిణాఫ్రికా క్రికెట్‌ కోచ్‌ మార్క్‌ బౌచర్‌ తెలిపాడు. కోహ్లీతో సహా టీమిండియా ప్లేయర్లు ఎవరితోనూ షేక్ హ్యాండ్ చేయమని వెల్లడించాడు. ప్రస్తుతం వైరస్‌ ప్రభావం […]

Update: 2020-03-09 21:32 GMT

కరోనా వైరస్ క్రీడారంగాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. కొన్ని దేశాల క్రికెట్ జట్లు విదేశీ పర్యటనలు రద్దు చేసుకుంటున్నాయి. మరికొన్ని జట్లు విదేశీ పర్యటనలకు వెళ్తున్నా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. త్వరలో దక్షిణాఫ్రికా జట్టు భారత్ లో పర్యటించనుంది. కరోనాకు దూరంగా ఉండేందుకు తమ జట్టు సభ్యులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారని దక్షిణాఫ్రికా క్రికెట్‌ కోచ్‌ మార్క్‌ బౌచర్‌ తెలిపాడు. కోహ్లీతో సహా టీమిండియా ప్లేయర్లు ఎవరితోనూ షేక్ హ్యాండ్ చేయమని వెల్లడించాడు. ప్రస్తుతం వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉండటంతో షేక్ హ్యాండ్ చేయకపోవడమే మంచిదని మేము భావిస్తున్నామని తెలిపారు. మాకు భద్రతా సిబ్బంది ఉన్నారు. వారి సలహాలు, సూచనల మేరకు ముందుకు వెళ్తామని బౌచర్‌ తెలిపాడు. దక్షిణాఫ్రికా నుంచి భారత్ కి బయలుదేరే క్రమంలో మీడియాతో మాట్లాడిన బౌచర్‌ ఈ విషయాలను వెల్లడించాడు. ఇక ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య మార్చి 12న తొలి వన్డే, లక్నో వేదికగా మార్చి 15న రెండో వన్డే, కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌లో మార్చి 18న ఆఖరి వన్డే జరగనుంది.

Tags: shake hands, India vs South Africa, South African cricket coach Mark Boucher

Tags:    

Similar News