జర్నలిస్టులకు అనుమతి ఇస్తున్నాం
దిశ, అమరావతి: పాత్రికేయ వృత్తిలో భాగంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నవాళ్లు ఎక్కడికి వెళ్లడానికైనా అనుమతి ఉందని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. కోవిడ్-19 ను ఎదుర్కోవడంలో పాత్రికేయులది గురుతర బాధ్యత వహిస్తున్నారని ఆయన అభివర్ణించారు. అలాగే కరోనా నివారణ చర్యలపై అవగాహన కల్పించేందుకు జర్నలిస్టులు ప్రజలకు మరింత చేరువ కావాలన్నారు. అంతేకాకుండా కరోనా నుంచి రక్షించుకోవడానికి పాత్రికేయులు కూడా తగు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. విధుల్లో ఉన్న […]
దిశ, అమరావతి: పాత్రికేయ వృత్తిలో భాగంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నవాళ్లు ఎక్కడికి వెళ్లడానికైనా అనుమతి ఉందని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. కోవిడ్-19 ను ఎదుర్కోవడంలో పాత్రికేయులది గురుతర బాధ్యత వహిస్తున్నారని ఆయన అభివర్ణించారు. అలాగే కరోనా నివారణ చర్యలపై అవగాహన కల్పించేందుకు జర్నలిస్టులు ప్రజలకు మరింత చేరువ కావాలన్నారు. అంతేకాకుండా కరోనా నుంచి రక్షించుకోవడానికి పాత్రికేయులు కూడా తగు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. విధుల్లో ఉన్న ప్రతీ ఒక్కరు శానిటైజర్లు, మాస్కులు దగ్గర పెట్టుకోవాలని చెప్పారు. అలాగే, సోషల్ మీడియాలో అపోహలు భయాందోళనలు కల్గించే వార్తలు, అవాస్తవాలను ప్రచారం చేయవద్దన్నారు. ఇటువంటి అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకుంటామని విజయ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.