అదిగో పులి.. సోషల్ మీడియాలో పోస్టులు.. అటవీశాఖ అధికారుల వార్నింగ్
దిశ, కరీంనగర్ సిటీ : అటవీ జంతువుల సంచారంపై తప్పుడు పోస్టులు సృష్టిస్తూ, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చర్యలు తప్పవని జిల్లా అటవీ శాఖాధికారులు హెచ్చరించారు. సోమవారం రాత్రి నగరంలోని మార్కెట్ యార్డులో పులి సంచరిస్తున్నట్లు వదంతులు రాగా, సోషల్ మీడియాలో విపరీత ధోరణిలో పోస్టులు పెట్టారు. దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతంలో గాలించగా ఎలాంటి ఆనవాళ్లు లభించలేదన్నారు. ఇలాంటి పోస్టులతో నగరవాసులు భయబ్రాంతులకు గురయ్యే అవకాశాలుంటాయని, మరోసారి ఇలాంటి పోస్టులు […]
దిశ, కరీంనగర్ సిటీ : అటవీ జంతువుల సంచారంపై తప్పుడు పోస్టులు సృష్టిస్తూ, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చర్యలు తప్పవని జిల్లా అటవీ శాఖాధికారులు హెచ్చరించారు. సోమవారం రాత్రి నగరంలోని మార్కెట్ యార్డులో పులి సంచరిస్తున్నట్లు వదంతులు రాగా, సోషల్ మీడియాలో విపరీత ధోరణిలో పోస్టులు పెట్టారు.
దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతంలో గాలించగా ఎలాంటి ఆనవాళ్లు లభించలేదన్నారు. ఇలాంటి పోస్టులతో నగరవాసులు భయబ్రాంతులకు గురయ్యే అవకాశాలుంటాయని, మరోసారి ఇలాంటి పోస్టులు పెడితే, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు.