‘నాన్నా.. ఇంటికొచ్చెయ్’

దిశ, స్పోర్ట్స్: సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూతుర్లు రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి చేత కంటతడి పెట్టిస్తున్నది. ఐపీఎల్ కోసం కుటుంబాన్ని వదిలి ఇండియాకు వచ్చిన వార్నర్.. లీగ్ వాయిదా పడటంతో స్వదేశానికి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ ఇళ్లకు చేరుకోవడానికి పలు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వార్న్ కూతుర్లు ఇవీ, ఇండీ, ఇస్లా రాసిన లేఖ అందరినీ ఆకట్టుకుంటుంది. ‘ప్లీజ్ డాడీ.. […]

Update: 2021-05-04 11:31 GMT

దిశ, స్పోర్ట్స్: సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూతుర్లు రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి చేత కంటతడి పెట్టిస్తున్నది. ఐపీఎల్ కోసం కుటుంబాన్ని వదిలి ఇండియాకు వచ్చిన వార్నర్.. లీగ్ వాయిదా పడటంతో స్వదేశానికి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ ఇళ్లకు చేరుకోవడానికి పలు ఆటంకాలు ఎదురవుతున్నాయి.

ఈ నేపథ్యంలో వార్న్ కూతుర్లు ఇవీ, ఇండీ, ఇస్లా రాసిన లేఖ అందరినీ ఆకట్టుకుంటుంది. ‘ప్లీజ్ డాడీ.. మీరు ఎక్కడికీ వెళ్లకుండా ఇంటికే వచ్చేయండి. నిన్ను చాలా మిస్ అవుతున్నాము. మీరంటే ఎంతో ప్రేమ.’ అంటూ ఆ ముగ్గురూ ఎంతో భావోద్వేగంతో ఈ లేఖ రాశారు. దీన్ని డేవిడ్ వార్నర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నాడు. అంతే కాకుండా ఆ లేఖలో వేసిన చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.

Tags:    

Similar News