అమెరికాలో వరంగల్ వాసి మృతి
దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో వరంగల్ వాసి మృతి చెందాడు. న్యూజెర్సీలోని ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్న ప్రవీణ్‌కుమార్ రైలులోనే రాకపోకలు చేసేవాడు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 22న ఆఫీసుకు బయల్దేరిన ప్రవీణ్ కుమార్ రైలు ఎక్కే క్రమంలో పట్టాలపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య నవత కూడా అమెరికాలోనే పని చేస్తుంది. వీరద్దరికి 3 సంవత్సరాల బాబు ఉన్నాడు. ప్రవీణ్ స్వస్థలం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపుర్ మండలం అంబాల గ్రామం. […]
దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో వరంగల్ వాసి మృతి చెందాడు. న్యూజెర్సీలోని ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్న ప్రవీణ్‌కుమార్ రైలులోనే రాకపోకలు చేసేవాడు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 22న ఆఫీసుకు బయల్దేరిన ప్రవీణ్ కుమార్ రైలు ఎక్కే క్రమంలో పట్టాలపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య నవత కూడా అమెరికాలోనే పని చేస్తుంది. వీరద్దరికి 3 సంవత్సరాల బాబు ఉన్నాడు. ప్రవీణ్ స్వస్థలం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపుర్ మండలం అంబాల గ్రామం. తండ్రి రాజమౌళి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్నారు. కానీ, ఉద్యోగ నిమిత్తం హన్మకొండలోని భవానీనగర్‌లో సెటిల్ అయ్యారు. ఇక కుమారుడి మరణ వార్త విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించేందుకు అధికారులు చొరవ చూపాలని వేడుకుంటున్నారు. చనిపోయి రెండ్రోజులు అయినా ఇంకా ఆస్పత్రిలోనే పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.