నిర్మల్‌కు కొత్త సీఐలొచ్చారు

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కేంద్ర టౌన్ సీఐతో పాటు రూరల్ సీఐ పోస్టులను భర్తీ చేస్తూ వరంగల్ రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఇద్దరు సీఐలు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నిర్మల్ పట్టణ నూతన సీఐ గా ఎన్. శ్రీనివాస్ నియమితులయ్యారు. ఇంతకాలం డీసీఆర్బీలో ఆయన పని చేశారు. మొన్నటిదాకా పట్టణ సీఐగా పనిచేసిన జాన్ దివాకర్ పదవీ విరమణ చేశారు. ఇక నిర్మల్ రూరల్ సీఐగా పనిచేసిన శ్రీనివాసరెడ్డి వరంగల్ […]

Update: 2020-09-02 10:24 GMT

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కేంద్ర టౌన్ సీఐతో పాటు రూరల్ సీఐ పోస్టులను భర్తీ చేస్తూ వరంగల్ రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఇద్దరు సీఐలు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నిర్మల్ పట్టణ నూతన సీఐ గా ఎన్. శ్రీనివాస్ నియమితులయ్యారు. ఇంతకాలం డీసీఆర్బీలో ఆయన పని చేశారు. మొన్నటిదాకా పట్టణ సీఐగా పనిచేసిన జాన్ దివాకర్ పదవీ విరమణ చేశారు. ఇక నిర్మల్ రూరల్ సీఐగా పనిచేసిన శ్రీనివాసరెడ్డి వరంగల్ జిల్లాకు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో స్పెషల్ బ్రాంచ్ సీఐగా పనిచేస్తున్న బి.వెంకటేష్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు ఆయన కూడా బాధ్యతలు స్వీకరించారు.

Tags:    

Similar News