ఉట్లపల్లి సమీపంలో పెద్దపులి సంచారం

దిశ, మహముత్తారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలంలోని ఉట్లపల్లి గ్రామసమీపంలో పెద్దపులి సంచారం‌తో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామస్తులు ఉదయాన్నే సమీపంలోని పల్లెప్రకృతి వనం వైపు వెళ్తుండగా పెద్దపులి అడుగులను గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అజాంనగర్ ఎఫ్ఆర్ఓ దివ్య సిబ్బంది‌తో పులి సంచరించిన ప్రదేశానికి చేరుకొని అడుగులను కొలతలు తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెద్దపులి అడుగులేనని ప్రజలకు తెలియజేశారు. పొలారం, ఉట్లపల్లి గ్రామాలతో పాటు సమీప […]

Update: 2021-12-03 04:40 GMT

దిశ, మహముత్తారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలంలోని ఉట్లపల్లి గ్రామసమీపంలో పెద్దపులి సంచారం‌తో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామస్తులు ఉదయాన్నే సమీపంలోని పల్లెప్రకృతి వనం వైపు వెళ్తుండగా పెద్దపులి అడుగులను గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అజాంనగర్ ఎఫ్ఆర్ఓ దివ్య సిబ్బంది‌తో పులి సంచరించిన ప్రదేశానికి చేరుకొని అడుగులను కొలతలు తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెద్దపులి అడుగులేనని ప్రజలకు తెలియజేశారు. పొలారం, ఉట్లపల్లి గ్రామాలతో పాటు సమీప గ్రామాల ప్రజలు ఎవరు కూడా అటవీప్రాంతంలో‌కి వెళ్లరాదని సూచించారు. పశువుల కాపరులు పశువులను అడవిలోకి పంపరదాని తెలిపారు. ఎవరైనా వేటగాళ్లు పులిని వేటాడేందుకు విద్యుత్ వైర్లు కానీ, ఉచ్చులు పెట్టి పులికి ప్రాణహాని కలిగిస్తే వారికి చట్టప్రకారం జీవిత ఖైదు తప్పదని హెచ్చరించారు. ఎఫ్ ఆర్ ఓ వెంట డీ ఆర్ ఓ అదిల్, బీట్ అధికారి చంద్రశేఖర్‌తో పాటు బేస్ క్యాంప్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags:    

Similar News