Pooja Khedkar: మాజీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ కు ముందస్తు బెయిల్ నిరాకరణ

మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్(Ex-IAS trainee Pooja Khedkar)కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది.

Update: 2024-12-23 10:40 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్(Ex-IAS trainee Pooja Khedkar)కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. యూపీఎస్సీ (UPSC) చీటింగ్ కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) నిరాకరించింది. సమాజంలో వెనుకబడిన వర్గాల కోసం ఉన్న పథకాల ప్రయోజనాలను పొందాలనే ఉద్దేశ్యంతో ఖేడ్కర్ ప్రవర్తించినట్లు తెలుస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. మోసపూరితంగా వికలాంగులు, ఓబీసీ కోటాలో ప్రయోజనం పొందారని తెలిపింది. ఆమె చర్యలు అనేక ప్రశ్నలను లేవెనెత్తుతున్నాయని అన్నారు. ఆమె చర్యలు రాజ్యాంగ సంస్థను మాత్రమే కాకుండా మొత్తం సమాజాన్ని అణగదొక్కే మోసానికి ఉదాహరణగా నిలుస్తాయన్నారు. వ్యవస్థను తారుమారు చేసే పెద్ద కుట్రలో భాగంగా ఆమె కనిపిస్తున్నాయన్నారు. ఈ కేసులో విచారణ అవసరమని హైకోర్టు పేర్కొంది. అంతేకాకుండా, పూజా ఖేడ్కర్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. ఇకపోతే పూజా ఖేడ్కర్ కు గతంలోనే ట్రయల్ కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. దీంతో ఆమె ట్రయల్ కోర్టు తీర్పుని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో, ఆమెకు అక్కడ కూడా ఎదురుదెబ్బే తగిలింది.

గతంలో రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు

చీటింగ్ కేసులో పూజా ఖేడ్కర్ కు ఆగస్టులో హైకోర్టులో ఊరట దక్కింది. ఆమెను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించింది. అయితే, ఈ కేసులో సాక్ష్యాలు, ఆరోపణలను సమీక్షించిన తర్వాత హైకోర్టు ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. పూణేలో ట్రైనీ సహాయ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఆమెపై అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్ లు సమర్పించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపైనే, ఆమెపై కేసు నమోదైంది. రిజర్వేషన్ ప్రయోజనాలను పొందేందుకు 2022లో యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కోసం ఆమె చేసిన దరఖాస్తులో తప్పుడు సమాచారాన్ని అందించినందుకు పూజా ఖేడ్కర్ ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సస్పెండ్ చేసింది.

Tags:    

Similar News