భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి కలకలం.. ధృవీకరించిన అధికారులు

దిశ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనుషులను చంపి తినే పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. జిల్లాలో అత్యధికంగా అటవీ ప్రాంతం విస్తరించి ఉండటంతో ఈ మధ్యకాలంలో అడవి జంతువుల సంచారం అధికంగా కనబడుతోంది. గత ఏడాది కాలంలో జిల్లాలో అనేక చోట్ల పులుల సంచారం అటవీ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. శుక్రవారం లక్ష్మీదేవిపల్లి మండలం తోక బందాలలో ఓ ఆవును పులి చంపినట్లు ఫారెస్ట్ అధికారులు […]

Update: 2021-11-19 09:59 GMT

దిశ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనుషులను చంపి తినే పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. జిల్లాలో అత్యధికంగా అటవీ ప్రాంతం విస్తరించి ఉండటంతో ఈ మధ్యకాలంలో అడవి జంతువుల సంచారం అధికంగా కనబడుతోంది. గత ఏడాది కాలంలో జిల్లాలో అనేక చోట్ల పులుల సంచారం అటవీ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. శుక్రవారం లక్ష్మీదేవిపల్లి మండలం తోక బందాలలో ఓ ఆవును పులి చంపినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు.

జిల్లాలో అనేక చోట్ల పెద్ద పులుల సంచారం ఉన్నట్టు ఫారెస్టు అధికారులు గుర్తించారు. అశ్వాపురం మండలం తుమ్మల చెరువు, వెంకటాపురం పంచాయతీ కనకరాజు గుట్టలో గతంలో తుమ్మల చెరువుకు చెందిన మడకం గురువయ్య ఆవు మేతకు వెళ్లినప్పటి నుంచి కనిపించకుండా పోయింది. ఆవు కోసం తీవ్రంగా వెతికిన అనంతరం సాయిబుల గుంపు గుట్టపై ఆవు కళేబరాలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు పెద్దపులి సంచారాన్ని అటవీశాఖ ధృవీకరించింది.

Tags:    

Similar News