బీజేపీలోకి వీవీఎస్ లక్ష్మణ్.. ఆ నియోజకవర్గం నుంచి పోటీ
దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ బీజేపీలో చేరనున్నారు. ఇప్పటికే ఆయన ఆ పార్టీ జాతీయ నేతలతో చర్చలు జరిపినట్లు సమాచారం. లక్ష్మణ్ చేరికకు కేంద్ర హోమంత్రి అమిత్‌షా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ నాయకత్వం కూడా స్వాగతిస్తోంది. హూజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత ఆయన ముహూర్తం ఖరారు కానుందని ఆ పార్టీ వర్గాల్లోని ఓ ముఖ్య నేత దిశకు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఒక నియోజకవర్గం నుంచి […]
దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ బీజేపీలో చేరనున్నారు. ఇప్పటికే ఆయన ఆ పార్టీ జాతీయ నేతలతో చర్చలు జరిపినట్లు సమాచారం. లక్ష్మణ్ చేరికకు కేంద్ర హోమంత్రి అమిత్‌షా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ నాయకత్వం కూడా స్వాగతిస్తోంది. హూజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత ఆయన ముహూర్తం ఖరారు కానుందని ఆ పార్టీ వర్గాల్లోని ఓ ముఖ్య నేత దిశకు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఒక నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. దీంతో ఆయన అభిమానుల్లో సంతోషం మొదలైంది.
ఇప్పటికే ఆయన ఎన్నికల్లో గెలిచేందుకు క్షేత్రస్థాయిలో ప్రత్యేక టీం ను కూడా సిద్ధం చేసినట్లు బీజేపీ లీడర్లు పేర్కొంటున్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పార్టీ జెండాను ఎగురవేయడమే తమ లక్ష్యమని, దీనిలో భాగంగానే పార్టీని బలోపేతం చేయబోతున్నట్టు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుల్లో ఒకరు తెలిపారు. ఇదిలా ఉండగా 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు లక్ష్మణ్ వీడ్కోలు పలికారు. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు కోచ్ గా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు ఇటీవలే దుబాయ్ లో ప్రారంభమైన టీ20 వరల్డ్ కప్ వ్యాఖ్యాతగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.