ఫోక్స్ వ్యాగన్ సంస్థ కీలక నిర్ణయం.. తక్కువ కార్లు ఉత్పత్తి

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కార్ల కంపెనీ ఫోక్స్ వ్యాగన్ సంస్థ ఉత్పత్తుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సెమీకండక్టర్ల కొరత కారణంగా ఈ ఏడాది కార్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. అయితే వచ్చే ఏడాది 2022 లో తక్కువ కార్లను ఉత్పత్తి చేయాలని సంస్థ భావిస్తోంది. 2021లో సెమీకండక్టర్ల కొరత కారణంగా సంస్థ కార్ల డెలివరీలు 9.3 మిలియన్లకు తగ్గిపోయాయి. కేవలం గత వారంలో ఇది 9.3 నుంచి 9 మిలియన్లకు చేరుకుంది. ఇలానే కొనసాగితే రాబోయే […]

Update: 2021-12-18 05:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కార్ల కంపెనీ ఫోక్స్ వ్యాగన్ సంస్థ ఉత్పత్తుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సెమీకండక్టర్ల కొరత కారణంగా ఈ ఏడాది కార్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. అయితే వచ్చే ఏడాది 2022 లో తక్కువ కార్లను ఉత్పత్తి చేయాలని సంస్థ భావిస్తోంది. 2021లో సెమీకండక్టర్ల కొరత కారణంగా సంస్థ కార్ల డెలివరీలు 9.3 మిలియన్లకు తగ్గిపోయాయి. కేవలం గత వారంలో ఇది 9.3 నుంచి 9 మిలియన్లకు చేరుకుంది. ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో ఇది 8 మిలియన్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని సంస్థ తెలిపింది.

ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ ఓలివర్ బ్లూ మే మాట్లాడుతూ.. ఈ సెమీకండక్టర్ల కొరత వచ్చే ఏడాదికి తీరుతుంది అంటే అది తప్పు అభిప్రాయం. చిప్‌ల సంక్షోభం ఇంకా కొన్ని నెలలు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే కొందరు సెమీకండక్టర్ల విషయంలో ముందడుగు వేసి తయారీ దారుల నుంచి నేరుగా విక్రయాలు చేస్తున్నారు. మరికొందరు కారులో మార్పులు చేస్తున్నారు. ఎలాగైనా వచ్చే ఏడాదికి ఈ కొరత తీరుతుందని వారంత భావిస్తున్నారని, కానీ వచ్చే ఏడాది కూడా సెమీకండక్టర్ కొరత కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. దానికి తగ్గట్టుగా మేము మా ఉత్పత్తులను కొంత మేరకు తగ్గించాము. చిప్‌ల కొరత తీరిన వెంటనే ఉత్పత్తులను పెంచుకుంటాము ఓలివర్ బ్లూ మే వెల్లడించారు.

Tags:    

Similar News