ఉద్యోగులను కాపాడుకునే పనిలో వొడాఫోన్ ఐడియా!
దిశ, వెబ్‌డెస్క్: వొడాఫోన్ ఐడియా ఇటీవలే వి(వీఐ)గా రీబ్రాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, పేరు మార్చినా, పబ్లిసిటీ పెంచినా సంస్థకు నష్టాలు మాత్రం తప్పట్లేదు. ఈ క్రమంలో సంస్థలోని ఉద్యోగులు వెళ్లిపోకుండా వొడాఫోన్ ఐడియా తమ ఉద్యోగులకు ఒక నెల వేతనాన్ని అదనంగా ఇవ్వడానికి సిద్ధమైంది. ప్రస్తుత ఏడాది నవంబర్ జీతంతో వన్-టైమ్ ఎక్స్‌గ్రేషియా చెల్లింపుగా అదనంగా ఒక నెల జీతాన్ని ఇవ్వనుంది. ఇప్పటికే కొందరు సీనియర్ లెవెల్ ఉద్యోగులు సంస్థను వదిలి వెళ్లాలని సిద్ధమైన […]
దిశ, వెబ్‌డెస్క్: వొడాఫోన్ ఐడియా ఇటీవలే వి(వీఐ)గా రీబ్రాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, పేరు మార్చినా, పబ్లిసిటీ పెంచినా సంస్థకు నష్టాలు మాత్రం తప్పట్లేదు. ఈ క్రమంలో సంస్థలోని ఉద్యోగులు వెళ్లిపోకుండా వొడాఫోన్ ఐడియా తమ ఉద్యోగులకు ఒక నెల వేతనాన్ని అదనంగా ఇవ్వడానికి సిద్ధమైంది. ప్రస్తుత ఏడాది నవంబర్ జీతంతో వన్-టైమ్ ఎక్స్‌గ్రేషియా చెల్లింపుగా అదనంగా ఒక నెల జీతాన్ని ఇవ్వనుంది.
ఇప్పటికే కొందరు సీనియర్ లెవెల్ ఉద్యోగులు సంస్థను వదిలి వెళ్లాలని సిద్ధమైన నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే, మార్కెటింగ్ డైరెక్టర్ అవనీశ్ ఖోస్లాను ఖాళీగా ఉన్న చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా ప్రమోట్ చేసింది. తాజాగా అదనపు నెల జీతం నిర్ణయంతో వొడాఫోన్ ఐడియా ఉద్యోగులు వచ్చే ఏడాది మార్చి 31 వరకు సంస్థను వదిలి వెళ్లకూడదు. చందాదారులు తగ్గిపోతుండడం, 4జీ నెట్‌వర్క్ సవాళ్లతో ఇబ్బంది పడుతున్న సంస్థ కొత్త నిర్ణయంపై సీనియర్లు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఇటీవల వొడాఫోన్ ఐడియా నష్టాలను అధిగమించేందుకు స్థూల ఆదాయ సర్దుబాటు చేస్తూ వస్తోంది.
ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ సంస్థలతో పోలిస్తే తక్కువ చందాదారులను కలిగి ఉంది. కొందరు ఎగ్జిక్యూటివ్‌లు సంస్థను విడిచి వెళ్లిపోతుండటంతో వినియోగదారు సేవల నాణ్యత తగ్గింది. దీంతో పొటెన్షియల్ సబ్‌స్క్రైబర్, ఆదాయ నష్టాలు భారీగా పెరిగాయి. దీంతో జియో, ఎయిర్‌టెల్ స్థాయిలో 4జీ కవరేజీని ఇవ్వలేకపోయింది. దీనివల్ల సంస్థ 80 లక్షల వరకు చందాదారులను పోగొట్టుకుంది. మార్కెట్ షేర్ కూడా తగ్గిపోయింది. ఈ క్రమంలోనే సంస్థను గాడిలో పెట్టేందుకు సీనియర్ స్థాయి ఉద్యోగులను కాపాడుకోవాలని నిర్ణయం తీసుకుంది.