రూ. వెయ్యి కోట్ల బకాయి చెల్లించిన వొడాఫోన్ ఐడియా!
సర్దుబాటు చేసిన స్థూల రాబడి బకాయిలను చెల్లించడంలో ఆలస్యంతో పాటు కోర్టు ధిక్కరణను పాల్పడినందుకు సుప్రీంకోర్టు టెలికాం సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా గురువారం రెండో విడత చెల్లింపులో భాగంగా రూ. 1000 కోట్లు చెల్లించింది. ఏజీఆర్ బకాయిల్లో భాగంగా సోమవారం రూ. 2,500 కోట్లు చెల్లించిన తర్వాత తాజాగా చెల్లించిన రూ. వెయ్యి కోట్లతో కలిపి వొడాఫోన్ ఐడియా మొత్తం రూ. 3,500 కోట్ల […]
సర్దుబాటు చేసిన స్థూల రాబడి బకాయిలను చెల్లించడంలో ఆలస్యంతో పాటు కోర్టు ధిక్కరణను పాల్పడినందుకు సుప్రీంకోర్టు టెలికాం సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా గురువారం రెండో విడత చెల్లింపులో భాగంగా రూ. 1000 కోట్లు చెల్లించింది. ఏజీఆర్ బకాయిల్లో భాగంగా సోమవారం రూ. 2,500 కోట్లు చెల్లించిన తర్వాత తాజాగా చెల్లించిన రూ. వెయ్యి కోట్లతో కలిపి వొడాఫోన్ ఐడియా మొత్తం రూ. 3,500 కోట్ల చెల్లింపులను పూర్తీ చేసింది.
వొడాఫోన్ ఐడియా చెల్లించాల్సిన మొత్తం ఏజీఆర్ బకాయి రూ. 53,000 కోట్లు. గురువారం బకాయి చెల్లించిన తర్వాత వొడాఫోన్ ఐడియా షేర్ ధర అమాంతం లాభాల్లోకి పయనించింది. మార్కెట్లు ముగిసే సమయానికి వొడాఫోన్ ఐడియా షేర్ ధర 4.76 శాతం పెరిగింది. మరో టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ కూడా ఏజీఆర్ చెల్లింపుల్లో భాగంగా టెలికాం విభాగానికి రూ. 10 వేల కోట్లు చెల్లించింది. మిగిలిన మొత్తం మార్చి 17లోపు చెల్లించనున్నట్లు ప్రకటించింది.