నేను తాగుబోతు కాదు.. నా తప్పేమీ లేదు: కోలీవుడ్ హీరో

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ హీరో విష్ణు విశాల్‌పై తను నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ ఓనర్ ఫిర్యాదు చేయడంతో మీడియాలో మరోసారి నిలిచాడు. తాగి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని..ఇంటి ఓనర్ ఇచ్చిన కంప్లైంట్‌పై ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టి వివరణ ఇచ్చాడు. 300 మందితో తన సినిమా షూటింగ్ చేయాల్సి ఉందని..దీంతో కరోనా కారణంగా తల్లిదండ్రులకు దూరంగా ఉండేందుకు అపార్ట్‌మెంట్ రెంట్‌కు తీసుకున్నట్లు తెలిపాడు విష్ణు విశాల్. అయితే ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండే ఇంటి ఓనర్ షూటింగ్ […]

Update: 2021-01-24 05:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ హీరో విష్ణు విశాల్‌పై తను నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ ఓనర్ ఫిర్యాదు చేయడంతో మీడియాలో మరోసారి నిలిచాడు. తాగి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని..ఇంటి ఓనర్ ఇచ్చిన కంప్లైంట్‌పై ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టి వివరణ ఇచ్చాడు. 300 మందితో తన సినిమా షూటింగ్ చేయాల్సి ఉందని..దీంతో కరోనా కారణంగా తల్లిదండ్రులకు దూరంగా ఉండేందుకు అపార్ట్‌మెంట్ రెంట్‌కు తీసుకున్నట్లు తెలిపాడు విష్ణు విశాల్. అయితే ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండే ఇంటి ఓనర్ షూటింగ్ కోసమని తాను ఎర్లీమార్నింగ్స్ బయటకు వెళ్లడం, లేట్ నైట్ రావడాన్ని ప్రతిసారి క్వశ్చన్ చేసేవాడని..ప్రతీది డిస్టర్బ్‌గా ఫీల్ అయ్యేవాడని చెప్పాడు.

మూవీ యూనిట్‌లో డీఓపీ పుట్టినరోజున అపార్ట్‌మెంట్‌లో పార్టీ చేసుకున్న రోజు గొడవ జరిగిందని..అందరిలాగే పార్టీలో తాము కూడా ఆల్కహాల్ యూజ్ చేశామని చెప్పాడు. అందులో తప్పేమీ లేదని అనుకుంటున్నానని వివరించాడు. దానికి అపార్ట్‌మెంట్ ఓనర్ ఇష్టం వచ్చినట్లుగా తిట్టడంతో మనిషిగా తనకు కూడా కోపం వచ్చిందని..తాను కూడా రిటర్న్ మాట్లాడాను అని పేర్కొన్నాడు. ఈ ఘటన జరిగాక పోలీసులు వచ్చారని..తను ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్‌తో శాటిస్‌ఫై అయి వెళ్లిపోయారని చెప్పాడు.

నాన్న వయసున్న అపార్ట్‌మెంట్ ఓనర్‌కు రెస్పెక్ట్ ఇచ్చి మళ్లీ పోలీసులను ఆశ్రయించకుండా ఊరుకున్నానని..ఆయన కొడుకుతో మాట్లాడాక గొడవ సద్దమణిగిందని వివరించాడు. తనకు ఎలాంటి హెవీ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం ఇష్టముండదని కానీ, మీడియాలో తనను వ్యసనపరుడిగా చిత్రీకరించడం నచ్చకపోవడం వల్లే ఇదంతా చెప్పాల్సి వస్తుందన్నారు విష్ణు విశాల్. ప్రజలు రెండు వైపులా ఆలోచించాలని..ఒక వైపు ఆలోచించి తనను దోషిగా చిత్రీకరించకూడదని అభ్యర్థించాడు

Tags:    

Similar News